నేటి సాక్షి, కొడిమ్యాల నవంబర్ 12 బుధవారం కొడిమ్యాల మండలం. నాచుపల్లి (కొండగట్టు) జేఎన్టీయూ గెస్ట్ హౌస్ లో బుధవారం. చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్, బి. సత్యప్రసాద్, సమక్షంలో జె. యన్. టి. హెచ్. ఇంజనీరింగ్ కళాశాలలో మల్యాల- కొడిమ్యాల మండలానికి, చెందిన. ప్యాడీ ప్రొక్యూర్ మెంట్ ( వరి ధాన్యం కొనుగోల్లు) పై సమీక్ష సమావేశం నిర్వహించారు.తదుపరి ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్ళల్లో వరి ధాన్యం త్వరగా తూకం వేయాలని రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తూకంలో వడ్లు నాసిరకం ఉన్నాయని మిల్లర్లు తూకం వేయడం ఆపినందున రెండు మండలాల రైస్ మిల్లు యజమాను నిర్ణయం తీసుకున్నందు వలన ఇట్టి సమావేశానికి మల్యాల కొడిమ్యాల మండలాలకు చెందిన పార్టీ ప్రెసిడెంట్లు, AMC చైర్మన్లు. సింగిల్ విండో చైర్మన్లు సంబంధిత అధికారులు నాయకులు కార్యకర్తలు. పాల్గొన్నారు.





