నేటి సాక్షి, బాపట్ల జిల్లా (బాపట్ల టౌన్) పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని నిర్మాణ పనులు వేగవంతంగా నిర్వహించాలి అని బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి అన్నారు.పురపాలక సంఘం పరిధిలోని 11 వ వార్డు ప్యాడిసన్ పేట లే-అవుట్ నందు నిర్మాణంలో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం కమీషనర్ జి.రఘునాథ రెడ్డి పరిశీలించారు. గౌరవ శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ ఇచ్చిన సూచనలను అనుసరించి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అలాగుననే నిర్మాణం నాణ్యతలో ఎటువంటి రాజీ వద్దని కాంట్రాక్టర్ కి సూచించారు.అనంతరం 23వ వార్డులోని వివేకానంద కాలనీ మునిసిపల్ పార్కును ఆయన పరిశీలించారు.తదుపరి సుందరీకరణ పనుల పురోగతిని గురించి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యస్.యస్.అర్.కృష్ణారెడ్డి ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. మిగిలిన పనులను కూడా సాధ్యమైనంత త్వరలో పూర్తి చేయాలని డి.ఈ ని ఆదేశించారు.





