Tuesday, March 17, 2026

పత్తివరి కొనుగోలు కేంద్రంలో తేమ శాతం పేరుతోరైతులను ఇబ్బంది పెట్టకూడదు ఏఐయుకేఎస్ రాష్ట్ర కార్యదర్శి బి రాము….

నేటి సాక్షి నారాయణపేట నవంబర్ 12,నారాయణపేట జిల్లా మక్తల్ మండలం లో అఖిలభారత ఐక్య రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం బుధవారంనాడు స్థానిక ఐబి లో జరిగినది. ఏ ఐ యుకేఎస్ జిల్లా అధ్యక్షులు భగవంతు ఈ సమావేశానికి అధ్యక్షత వహించగా ముఖ్య వక్తలు అఖిలభారత ఐక్యరైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బి రాము హాజరై మాట్లాడుతూ పత్తి కొనుగోలు సిసిఐ కేంద్రంలో తేమ శాతం పేరుతోరైతులను మోసం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం క్వింటాల్ పత్తికి 8100 నిర్ణయించగా తేమ పేరు తోటి కోతలు పెడుతున్నారు అదే రకంగా వరి కొనుగోలు కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఐకెపి సెంటర్లు ప్రారంభించారు కానీ నారాయణ పేట్ జిల్లాలో ఒక్క సెంటర్లో కూడా 50 టన్నులు కొనుగోలు చేయలేదుఅధిక వర్షాల వల్ల చలి విపరీతంగా పెరగడం వల్ల వడ్లు ఆరడం లేదు తేమశాతం పేరుతో రైతులku కోత పెడుతున్నారుతడిసిన ధాన్యంముక్కువయిన వడ్ల సైతం ఒక్క గింజ కూడా వదలకుండా కొనుగోలు చేస్తాం అని చెప్తున్నారుకేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులను మోసం చేస్తున్నారు పత్తి కింటాలుకు 8100 రూపాయలకు కొనుగోలు చేస్తున్నాము అని చెప్పడం కె పరిమితమైనది దీనికి ఒక ఎకరాకు 12 కింటాలు కొనుగోలు చేస్తామని 7 క్వింటాలకు పరిమితం చేస్తూ సిసిఐ కేంద్రాలకు ఆర్డర్ జారీ చేసింది ఇది రైతులను మోసం చేయడమే ఎకరాకు 12 క్వింటాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదే రకంగావరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 15 రోజులైనా ఈరోజుకు ఎక్కడ కొనుగోలు చేయడం లేదు తేమ పేరు తోఆరబెట్టుకొని ఐకెపి కేంద్రాల దగ్గరకు తీసుకురావాలని అని చెప్పుతున్నారు గత వర్షాకాలము రబీ పంటలు రైతులు ఆరాబెట్టుకొని డైరెక్ట్ గా బార్ధాన్ సంచులు తీసుకొని పంపించేవారు కానీ ఇప్పుడు పొలంలో కోతలు కోసి అక్కడ నుండి ఆరబెట్టే ఐకెపి.సెంటర్కు తీసుకొచ్చి వరకు ఒక క్వింటాల్కు 500 రూపాయలు ట్రాన్స్పోర్టు అమలు ఖర్చు అవుతుందిఇట్లా రైతులు నష్టపోతున్నారు ఇది ప్రభుత్వం భరించాలిఅధికారులు ఐకెపి సెంటర్లో పరిశీలన చేసి కొనుగోలు చేయాలని సూచన చేసే వరకు రైతులు అనేక ఇబ్బందులు పడతారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి రైతులను దగా చేయడమే వ్యవసాయానికి దూరం చేయడమే అమ్మబోతే అడివాయ కొనబోతే కొరివాయ అన్నచందంగా ఉంది రైతు దుక్కి నుండి మొక్క నాటిన నుండి కోత కోసి వరకు అనేక ఆటుపోట్లను ఎదుర్కొని పంట పండిస్తాడు కానీ అలసట కాడు కానీ అమ్మడం కోసము నాకు ధర రావడం లేదు అని నిరాశకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వాలు రైతులు పండించిన పంటలు తక్షణమే పత్తి వరి మొక్కజొన్న కొనుగోలు చేయాలని డిమాండ్ చేసినారుఈ సమావేశానికి అఖిలభారత ఐక్య రైతు సంఘం కార్యదర్శి యాదగిరి ఉపాధ్యక్షులు కొండ నర్సింలు కృష్ణ నారాయణ ఆనందు చంద్రములు రాజు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News