నేటి సాక్షి, బాపట్ల జిల్లా (కర్లపాలెం)వికలాంగులైన మాజీ సైనికుల పిల్లలకు ప్రతి నెలా సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందిస్తున్న ఆర్ధిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు.బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం పాత నందాయ పాలెం గ్రామానికి చెందిన మాజీ సైనికుడు చీరాల నాగేంద్ర రెడ్డి కుమారుడు శశి కిరణ్ రెడ్డి 90 శాతం అంగవైకల్య ధృవీకరణ పత్రాలతో బాదపడుతూ ఇంటికే పరిమితమవ్వగా, విషయం తెలుసుకున్న రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు వికలాంగుడైన మాజీ సైనికుని కుమారునికి ఆర్ధిక సహాయం కోసం గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారిని గుణ షీలా కు విషయాన్ని తెలియ జేయగా, బుధవారం పాత నందాయా పాలెం గ్రామానికి తన సిబ్బందితో సహా వచ్చి పత్రాలను పరిశీలించి తగు ఆర్ధిక సహాయం ప్రతి నెలా రూ ” 2500/_ (రెండువేల ఐదు వందల రూపాయలు) వచ్చే విధంగా చేస్తామని హామీ ఇచ్చిన ఉమ్మడి గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి గుణ షీలా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు ధన్యవాదములు తెలియజేశారు.మాజీ సైనికుల తో ఉమ్మడి గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి గుణ షీలా మాట్లాడుతూ, అంగవైకల్యం కలిగిన మాజీ సైనికుల పిల్లల గురించి తెలియ జేస్తే వెంటనే పరిశీలించి సహాయం చేసే దిశగా తగు చర్యలు తీసుకుంటాము అని తెలియ జేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ, 50 శాతం పై బడి ధృవీకరణ పత్రాలు కలిగిన మాజీ సైనికుల పిల్లలకు సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు అందిస్తున్న ఆర్ధిక సహాయాన్ని అర్హులైన మాజీ సైనికులు సద్వినియోగం చేసుకోవాలి అని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసు సూపరింటెండెంట్ ఆనందరావు, సుబ్రహ్మణ్యం, రాజేష్ మొదలగు కార్యాలయ సిబ్బంది, APRMSSS రాష్ట్ర కమిటీ గౌరవ సలహాదారులు సుంకర శేషగిరి రావు, బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు చలికొండ వెంకట కృష్ణారావు, సీనియర్ మాజీ సైనికులు డి వెంకటేశ్వర్లు మరియు MK రెడ్డి మొదలగు మాజీ సైనికులు పాల్గొన్నారు.





