Tuesday, March 24, 2026

*పేదల ఇంటి కలను నెరవేర్చడమే ప్రభుత్వం కృషి* * బాపట్ల శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ

నేటి సాక్షి, బాపట్ల జిల్లా (బాపట్ల టౌన్)ప్రతి పేదవాడి ఇంటి కల సహకారానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది అని బాపట్ల శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ అన్నారు.బాపట్ల మండలం గోపాపురం గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అర్బన్ పథకం ద్వారా నిర్మించిన గృహల ప్రవేశ కార్యక్రమం అధికారులు చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ పాల్గొని నూతన గృహ ప్రవేశ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మంది లబ్ధిదారులకు గృహ నిర్మాణం మంచిరు పత్రాలు అందజేయడం సంతోషదాయకమన్నారు. గత వైసిపి పాలనాలో పేదల ఇంటి కలలను నిర్రీర్యం చేశారని అన్నారు. అందుకే రాష్ట్ర ప్రజలు మరల నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పుట్టి మీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం సంక్షేమ పథకాలకు నిలువత్తు రూపంగా ఉందని అన్నారు. ఇంకా పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో డి.ఈ శ్రీనివాసరావు,బాపట్ల తాసిల్దార్ సలీమా,హౌసింగ్ అధికారి బాపట్ల మండల పార్టీ అధ్యక్షుడు ముక్కామల సాంబశివరావు,గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆశీర్వాదం,బీజేపి మండల పార్టీ అధ్యక్షుడు శ్రీరామయ్య మరియు కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News