“బాల కళా ఉత్సవ్ అవార్డు”కార్యక్రమానికి “ముసా అలీ ఖాన్” ను ఆహ్వానం….-“ఆత్మీయ అతిథి అవార్డు అందుకోనున్న ముసా అలీ ఖాన్”నేటిసాక్షి, మిర్యాలగూడ : శిఖరం ఆర్ట్ థియేటర్స్ “చిల్డ్రన్స్ డే బాల కళా ఉత్సవ్ అవార్డుల కార్యక్రమానికి మిర్యాలగూడ నటుడు సామాజికవేత్త మూసా అలీఖాన్ కు ఆత్మీయ అతిథిగా అవార్డు కు ఆహ్వానం అందినట్లు తెలిపారు.ఉభయ రాష్ట్రాలలో తనకంటూ గుర్తింపు పొందిన నటుడు సామాజికవేత్త మూసా అలీ ఖాన్ ను గురువారం 13వ తేదీన త్యాగరాయ గాన సభలో సినీ సెలబ్రిటీలు, నిర్మాతలు, దర్శకులు, రాజకీయ నాయకులు, సమాజ సేవకులు, పత్రికా ప్రతినిధులు, యూట్యూబ్ ఛానల్స్ అభిమానులు, కళాకారులు, పాల్గొంటున్న గొప్ప కార్యక్రమంలో శిఖరం ఆర్ట్ థియేటర్స్ కార్యక్రమ నిర్వాహకులు శ్రీ గొల్ల కృష్ణ ఘనంగా సన్మానిస్తున్నారని అన్నారు. ఆత్మీయ అతిథి అవార్డు గ్రహీత మూసా అలీఖాన్ మాట్లాడుతూ,నన్ను ఆత్మీయ అతిథిగా ఆహ్వానించి అవార్డులతో సన్మానిస్తున్న శిఖరం ఆర్ట్ నిర్వాహకులు గొల్ల కృష్ణ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోవు రోజుల్లో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటానికి నాపై ఇంకా బాధ్యత పెరుగుతుందని, సినిమా రంగంలో కొత్త సినిమాలకు నా వంతు ప్రమోషన్ చేస్తూ సినిమా ఆడియో ట్రైలర్ లాంచ్ పోస్టర్, లాంచ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లలో పాల్గొంటూ, మీ అందరి ఆశీర్వాదాలు పొందుతూ వెన్నంటి ప్రోత్సహిస్తున్న ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, మరియు యూట్యూబ్ ఛానల్స్ వారికి, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లలో ఆశీర్వదిస్తున్న ప్రతి ఒక్కరికి మూసా అలీ ఖాన్ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.




