నేటిసాక్షి, మిర్యాలగూడ : ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అంగన్వాడీ కేంద్రాలలో ప్రతి బుధవారం ఎగ్ బిర్యానీ పెట్టాలనే ఆదేశాల మేరకు మిర్యాలగూడ అర్బన్ ప్రాజెక్టు పరిధిలోని ఇస్లాంపురం సెక్టర్ పరిధిలోగల విద్యానగర్.1 అంగన్వాడి కేంద్రంను బుధవారం అర్భన్ సిడిపిఓ రేఖల మమత అంగన్వాడి కేంద్రంలోని ఎగ్ బిర్యానీ భోజనాన్ని పరిశీలించి, పిల్లలకు తానే స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ప్రతి బుధవారం గర్భిణీ బాలింతలకు మరియు ప్రీస్కూల్ పిల్లలకు, ఎగ్ బిర్యానీ భోజనాన్ని పెట్టాలని తెలియజేశారు. ధీని వలన లబ్ధిదారుల సంఖ్య పెంచుకోవచ్చని, అలాగే లబ్ధిదారులు కూడా ఎంతో ఆనందిస్తారని తెలియజేశారు.అంగన్వాడి కేంద్రాలలో అందించే పోషకాహారాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ నాగమణి, బ్లాక్ కో-ఆర్డినేటర్ కవిత, అంగన్వాడీ టీచర్ నర్మద,అంగన్వాడి సహాయకురాలు చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు.




