Tuesday, March 24, 2026

*పిడుగు తాకి గాయపడిన విద్యార్థికి మంత్రి మానవతా సహాయం**ఎంత ఖర్చైనా సరే… పిల్లవాడి ప్రాణం ముఖ్యం” — సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్*——————————————జగిత్యాల టౌన్ –

నేటి సాక్షి(పూరెళ్ల బాపు)……………………….,………..జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపు ఎస్సీ బాలుర వసతిగృహంపై గత సెప్టెంబర్‌లో పిడుగు పడటంతో విద్యార్థి బొల్లె హిమేష్ చంద్ర (8వ తరగతి) తీవ్రంగా గాయపడ్డాడు.టెర్రస్‌పై ఆరేసిన దుస్తులు తీసుకురావడానికి వెళ్లిన హిమేష్ పై ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పిడుగు పడింది. క్షణాల్లోనే మంటలు వ్యాపించి, అతని చేతులు, వెన్ను తీవ్రంగా కాలిపోయాయి. *అప్రమత్తతో వెంటనే స్పందించిన సిబ్బంది*వసతిగృహ సిబ్బంది వెంటనే బాలుణ్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం కరీంనగర్ ఆసుపత్రికి, ఆపై పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు.పిడుగు ప్రభావంతో భవనం పైకప్పు, గోడలు పగిలిపోయాయి. స్లాబ్ పెచ్చు లూడి మంచాలపై పడగా, ఆ సమయంలో విద్యార్థులు బయట ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది.మొదట ట్రాన్స్‌ఫార్మర్ పేలిందని భావించిన అధికారులు, విద్యుత్‌ శాఖ ఏఈడీ జవహర్‌లాల్ నాయక్‌ పరిశీలనలో — భవనంపై నేరుగా పిడుగు పడినట్లు తేలింది.*చలించిన మంత్రి అడ్లూరి —వెంటనే అధికారులకు ఆదేశాలు*ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు.*ఇప్పటివరకు 5 సార్లు… మంత్రి పరామర్శ*. తీవ్ర గాయాలైన పాలైన విద్యార్థి పట్ల మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు దాదాపు 5 సార్లు స్వయంగా తన సిబ్బందిని వెంటబెట్టుకొని ఆస్పత్రి సంబందించి వైద్యులంబిస్తున్న చికిత్సను తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించేలా ఎప్పటికప్పుడు ఆయన వైద్యులకు ఆదేశాలు జారీ చేశారుజిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్‌కు ఫోన్ చేసి ఆదేశిస్తూ —> విద్యార్థికి అత్యుత్తమ వైద్యం అందించండి. ఎంత ఖర్చైనా సరే, పిల్లవాడి ప్రాణం ముఖ్యం అని స్పష్టంగా చెప్పారు.దీంతో అధికారులు వెంటనే చర్యలు తీసుకొని, హిమశ్‌కు ప్రత్యేక వైద్యం అందేలా యశోద ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు నెలరోజులపాటు చికిత్స అందించి, ప్లాస్టిక్ సర్జరీ చేశారు. చికిత్స ఖర్చు దాదాపు ₹18 లక్షలు కావడంతో, సాధారణ కుటుంబం భరించలేని స్థితి ఏర్పడింది. విషయం తెలిసిన మంత్రి అడ్లూరి మానవతా దృక్కోణంతో నిర్ణయం తీసుకున్నారు. *బాలుడి ప్రాణం కంటే డబ్బు ముఖ్యం కాదు — మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్*మొత్తం వైద్య ఖర్చును సంక్షేమ శాఖ (SCDD) నిధుల నుండి చెల్లించాలంటూ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. దాంతో SCDD కమిషనర్ క్షితిజ గారు యశోద ఆసుపత్రికి చెల్లించాల్సిన బిల్లును చెక్కు రూపంలో అందజేశారు.*కన్నీటి పర్యంతుడైన తండ్రి*హిమేష్ చంద్ర స్వగ్రామం మల్యాల మండలంలోని మద్దుట్‌ గ్రామం. అతని తండ్రి బొల్లె శ్రీనివాస్, ఉపాధి కోసం గల్ఫ్ దేశంలో కూలీగా పనిచేస్తున్నారు.కుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వార్త విన్న ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.మంత్రిగారి చొరవతో కుమారుడు కోలుకున్నాడని తెలుసుకున్న తండ్రి భావోద్వేగంతో మాట్లాడుతూ… “నా బిడ్డ ప్రాణం నిలబెట్టింది ప్రభుత్వం.అడ్లూరి లక్ష్మణ్ గారు చూపిన దయ, మానవతా గుణం మా కుటుంబం ఎప్పటికీ మరచిపోలేదు.”*ప్రాణం నిలబెట్టిన మానవతా సహాయం*యశోద ఆసుపత్రిలో నెలరోజుల చికిత్స అనంతరం హిమేష్ చంద్ర పూర్తిగా కోలుకొని ఇంటికి చేరుకున్నాడు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది.ఒక చిన్నారి ప్రాణాన్ని రక్షించడంలో మంత్రి అడ్లూరి చూపిన మానవతా స్పందన, దయా హృదయం జగిత్యాల ప్రజల హృదయాలను తాకింది.ప్రజల మధ్య ఇప్పుడు ఒకే మాట వినిపిస్తోంది.మానవత్వమే అసలైన గొప్పతనం.అది చూపించారు అడ్లూరి లక్ష్మణ్ గారు.” అని ఈ సంఘటన, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచింది. ఈ ఘటనతో జగిత్యాల జిల్లా ప్రజల అభిమానాన్ని ప్రేమను చూరగొన్నారని జిల్లా వాసులు చెబుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News