నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల పట్టణంలోని కేరళ హైస్కూల్ ప్రాంగణంలో ‘కలివి వనం’ సినిమా పోస్టర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎం.ఏ. బారీ చేతుల మీదుగా సినిమా దర్శకుడు రాజ్ నరేంద్ర పోస్టర్ను ఆవిష్కరించారు.*అడవుల ప్రాముఖ్యతను చాటి చెప్పే సినిమా* ( సినిమా దర్శకుడు రాజ్ నరేంద్ర )సినిమా దర్శకుడు రాజ్ నరేంద్ర మాట్లాడుతూ, ‘కలివి వనం’ సినిమా అడవుల సంరక్షణ, ప్రకృతి పరిరక్షణ అనే అంశాల చుట్టూ తిరుగుతుందని, విద్యార్థులు తమ బాధ్యతను గుర్తించేలా తీసిన చిత్రం ఇది అని తెలిపారు. ఈ చిత్రం విద్యార్థులు, పిల్లలు, పెద్దలు అందరూ తప్పనిసరిగా చూడాల్సినదని పేర్కొన్నారు. అడవుల ప్రాముఖ్యతను, వాటి రక్షణ ద్వారా మన జీవవైవిధ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.*నైతిక విలువలతో కూడిన విద్య అవసరం*( కరస్పాండెంట్ ఎం.ఏ. బారీ )పాఠశాల కరస్పాండెంట్ ఎం.ఏ. బారీ మాట్లాడుతూ, నేటి సమాజంలో విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సమాజం, ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థి తీసుకోవాలని పిలుపునిచ్చారు. ‘కలివి వనం’ సినిమా తెలంగాణ భాష, యాస, మన కళాకారులతో నిర్మించిన చిత్రం అని పేర్కొన్నారు. అడవులను రక్షించడం ద్వారా రాబోయే తరాలకు ఆయువు అందించే వాయువును కాపాడతామన్నారు.ఈ సందర్భంగా నిర్మాతలు మల్లిఖార్జున్ రెడ్డి, కోలాన్ విష్ణువర్ధన్ రెడ్డి, ‘అది మనం’ సినిమా దర్శకుడు రాజ్ నరేంద్ర, సాంగ్ నిపుణులు, పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి సెలెన్ బోరీ, ఛైర్మన్ శ్రీ ఎం.ఏ. హాది, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు, విద్యార్థులు పాల్గొన్నారు._




