నేటి సాక్షి, నారాయణపేట నవంబర్ 13, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో గురువారం మరికల్ సమ్మద్ కార్ఖానా దగ్గర తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (టి యు సి ఐ) రాష్ట్ర నాయకులు పి.అరుణ్ కుమార్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చేటప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ,కాంగ్రెస్ మేనిఫెస్టోలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది బీడీ కార్మికులందరికీ ఇప్పుడు ఇస్తున్న 2016/- రూపాయలు నుంచి 4000/- రూపాయలకి పెంచుతానని హామీ ఇచ్చి ఎన్నికలో గెలిచి ఇప్పటికి రెండు సంవత్సరాలు గడిచిన పెంచకపోవడం శోచనీయమన్నారు. పిఎఫ్ తో సంబంధం లేకుండా బీడీ చేసే ప్రతి వర్కురకు పింఛన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బీడీ కార్మిక వర్గాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసగించారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం రావడం కోసం ప్రజల్ని , రైతుల్ని,నిరుద్యోగుల్ని , ఉద్యోగులను మోసగించినట్లే బీడీ కార్మికులకు నష్టం కలిగించారన్నారు. కనీస వేతనాల చట్టాన్ని పెరుగుతున్న ధరలు కనుగుణంగా సవరించాలని, పిఎఫ్ చట్టాన్ని ప్రతి బీడీ కార్మికునికి వర్తింపచేయాలని , పిఎఫ్ చేర్పులు ,రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందడం, చనిపోయిన వారికి పెన్షన్ పొందడం తదితర విషయాలపై పిఎఫ్ కార్మికులకు సరళంగా అందించే పద్ధతి తయారు చేయాలని డిమాండ్ చేశారు. పోగాకు నిషేధ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి బీడీ పరిశ్రమ దివాళి తీయడానికి కుట్రను రాష్ట్ర ప్రభుత్వ అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బీడీ పింఛన్ పెంచని యెడల భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సబేర,రామేశ్వరమ్మ, జానకమ్మ, రాబియా, రజియా, జాఫర్ బి, ప్యారి, మాస్మా , మంజుల,సాజిద, షాహిన్ , ఖాజా హుస్సేన్ , బలరాం తదితరులు పాల్గొన్నారు.





