Tuesday, March 17, 2026

*మాజీ మంత్రి జీవన్ రెడ్డి ని – కలిసిన కలివి వనం సినిమా దర్శకుడు రాజనరేంద్ర*————————————-జగిత్యాల టౌన్ –

నేటి సాక్షి(పూరెళ్ల బాపు)………………………………..జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో కలివి వనం సినిమా దర్శకుడు రాజ్ నరేంద్ర మాజీ మంత్రి జీవన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు.మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి రాజ్ నరేంద్ర ని శాలువతో సన్మానించారు.*మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ*పర్యావరణం కాపాడాలని కాన్సెప్ట్ తో సినిమా తీయడం అభినదనీయం ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలకు 50% రాయితీ ప్రభుత్వం కల్పించాలి.పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రకృతిని ఏ విధంగా పరిరక్షింప చేయాలని భావంతోని కలిపి వనం అనే సినిమా తీయడం దర్శకుడు రాజ్ నరేంద్రను అభినందించవలిసిన విషయం.సమాజం అనేది పర్యావరణం తోని ముడిపడి ఉందని చెప్పక తప్పదు ప్రస్తుతం పెరిగిపోతున్నటువంటి కాలుష్యం రకరకాల కాలుష్యం నివారింపు చేయడానికి ప్రకృతి పర్యావరణం పరిరక్షణ అవసరం.ఒకప్పుడు అడవులు గాని గుట్టలు గాని ప్రకృతి మనకు పరిణవిస్తుండే మారుతున్న పరిస్థితులు కాలానికి అనుగుణంగా అటవీ సంపదను హరించడం ఒకవైపు ఇంకోవైపు పర్యావరణ ప్రధానంగా గుట్టలు ఉంటేనే వాటిపై చెట్లు ఉంటాయి మట్టి కొరకు గుట్టలను త్రవ్వి తీయడం ముఖ్యంగా మన జగిత్యాల జిల్లా కేంద్రం తీసుకుంటే జగిత్యాల జిల్లా కేంద్రానికి నలువైపులా ప్రకృతి రమణీయంగా గుట్టలతో నిండి ఉంటుండే అలాంటిది గుట్టలు మట్టి కోసం తవ్వడంతో చెట్లు వృక్షాలు నిర్వీర్యం అవుతున్నాయి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి చెట్లు గుట్టలు చెరువులు అన్యక్రాంతం కాకుండా కాపాడుతున్న క్షేత్ర స్థాయిలో పరిరక్షణ కావడం లేదు.దర్శకుడు రాజ్ నరేంద్ర ఇలాంటి కాన్సెప్ట్ తీసుకొని పర్యావరణం పై సినిమా రూపకంగా చూపించడం హృదయ పూర్వక అభినందించ విషయం అని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ఈ లాంటి సినిమాలకు 50% రాయితీ ఇవ్వాలని కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News