Tuesday, March 17, 2026

*డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కార్తీక వన సమారాధన కార్యక్రమం*

నేటి సాక్షి తిరుపతి(బాదూరు బాల)*వెదురుకుప్పం*మండలంలోని డాక్టర్ వై.ఎస్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఐక్యూఏసీ, ఎన్.ఎస్.ఎస్ విభాగాల ఆధ్వర్యంలో కార్తీక వనసమారాధన ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా.బి. అన్నపూర్ణ శారద ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులు, అధ్యాపకులు చేసిన సమష్టి కృషిని అభినందించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఇలాంటి సాంప్రదాయ కార్యక్రమాలు విద్యార్థుల్లో సాంస్కృతిక అవగాహన, సామూహిక చైతన్యం పెంచుతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక,అధ్యాపకేత్ర బృందం, ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు, మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వనసమారాధన సందర్భంగా భక్తి శ్రద్ధలతో చెట్లకు పూజా కార్యక్రమాలు నిర్వహించి తదుపరి కార్యక్రమంలో భక్తి గీతాలు, మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డా.ఏ.సి.భరణి నాథ్ రెడ్డి విద్యార్థులకు మరియు అధ్యాపక అధ్యాపకేత్ర బృందానికి అల్పాహారం విందు ఏర్పాటు చేసినందుకుగాను కళాశాల తరఫున అందరూ ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.విద్యార్థులు ఈ రోజు ఎంతో ఉత్సాహంగా గడిపి, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించారు. మొత్తం కార్యక్రమం ఆనందభరితంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు అధ్యాపక బృందం పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News