Tuesday, March 24, 2026

*భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో లేఖ రచన పోటీలు*

నేటి సాక్షి తిరుపతి(బాదూరు బాల )భారత తపాల శాఖ నిర్వహిస్తున్న జాతీయ స్థాయి లేఖరచన పోటీ- 2025-26 దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 8, 2025 నుంచి డిసెంబర్ 8, 2025 వరకు జరుగనుంది. ఈ సంవత్సరం పోటీ థీమ్ నా ఆదర్శ వ్యక్తికి లేఖడిజిటల్ యుగంలో చేతిరాత పద్ధతి తగ్గిపోతున్న నేపథ్యంలో, పిల్లలు మరియు యువతలో చేతిరాత రాయాలనే అలవాటు, బావ వ్యక్తీకరణ, సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపట్టబడింది. లేఖ రాయడం వ్యక్తిత్వ వికాసం, ఆలోచనా శైలి, బావోద్వేగ వ్యక్తీకరణకు గొప్ప పునాది అని నిపుణులు సూచిస్తున్న విషయం తెలిసిందే.పోటీ విశేషాలు:పాటిలో భారత దేశ పౌరులందరూ పాల్గొనవచ్చు, లేఖ తెలుగు / హిందీ / ఇంగ్లీష్ / ప్రాంతీయ భాషల్లో ఎవ్వరైనా రాయవచ్చు, వయస్సు ఆధారంగా 2 గ్రూపులు: i) 18 సంవత్సరాల లోపు. ii) 18 సంవత్సరాల పైబడిన వారు. ప్రతి గ్రూపులో: ఇన్లాండ్ లెటర్ కార్డు వర్గం, ఇన్వెలోపే వర్గంగా రెండు కెటగిరీలుగా పోటీ జరుగుతుంది.లేఖ రాస్తున్నప్పుడు పాటించవలసిన నిబంధనలు:లేఖలు తప్పనిసరిగా చేతితో రాయాలి, టైప్ చేయబడినవి అంగీకరించబడవు. ఎ4 పీవర్ల పై గరిష్టంగా 1000 పదాలు, లేదా ఇన్లాండ్ లెటర్ కార్డులో 500 పదాలు లోపుగా రాయాలి. పాల్గొనే వారు లేఖచివర ఇలా పేర్కొనాలి:”నేను 01-01-2025 నాటికి 18 సంవత్సరాల లోపు/పైబడినవాడిని అని ధృవీకరిస్తున్నాను.”బహుమతులు:స్థాయిమొదటి బహుమతిరెండో బహుమతిమూడో బహుమతిరాష్ట్ర / సర్కిల్ స్థాయి₹25,000,₹10,000₹5,000జాతీయ స్థాయి₹50,000₹25,000₹10,000ప్రతి కేటగిరీలో పై బహుమతులు ఇవ్వబడతాయి. పాల్గొనదలచిన వారు తమ లేఖను సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్, తిరుపతి డివిజన్, తిరుపతి-517 501 చిరునామా రాసి పోస్టు చేయాలి. లేఖలు పంపుటకు చివరి తేదీ: డిసెంబర్ 8, 2025,

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News