నేటి సాక్షి,నారాయణపేట, నవంబర్ 13నారాయణపేట మండలంలోని వివిధ సబ్ సెంటర్లో పనిచేసే సెకండ్ ఏఎన్ఎం లకు గత మూడు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నామని తీవ్ర ఆవేదన చెందారు సెకండ్ ఏఎన్ఎంలు కోటకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కింద పది సబ్ సెంటర్లకు దగ్గర పని చేసే ఏఎన్ఎం లకు గత మూడు నెలల నుంచి జిల్లా రాష్ట్రవ్యాప్తంగా జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తమ కుటుంబాల పోషణ కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు, సబ్ సెంటర్లకు సంబంధించిన ప్రతి రికార్డులు రాయాలంటే దాదాపు ఒక్కొక్క ఏఎన్ఎం కు 30 రికార్డులు ఉంటాయి ఆ రికార్డులకు సంబంధించిన ఎలాంటి అమౌంటు రాలేదు ఇటు జీతాలు రాక ఇటు రెగ్యులర్ కాకా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందారు, సెంటర్ల కింద వెళ్లే విలేజ్ లకు చాలా గ్రామాలకు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని అప్పులు చేసి ఆటోలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పని చేస్తున్న సెకండ్ ఏఎన్ఎం లను రెగ్యులర్ చేసి పెండింగ్ లో ఉన్న జీతాలు విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు,సావిత్రమ్మ, అనురాధ, ఇందిరా, అరుణ, మాధవి తిరుపతమ్మ, సుజాత శోభ అనురాధ లు డిమాండ్ చేశారు.





