నేటి సాక్షి నారాయణపేట, నవంబర్ 13, నారాయణపేట జిల్లాలోని మక్తల్ పట్టణం లో రూ, 48కోట్ల బడ్జెట్ తో నూతనంగా నిర్మిస్తున్న 150 పడకల ఆసుపత్రిని గురువారం సందర్శించిన మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు.పనుల పురోగతి పై అక్కడి అధికారులను, ఇంజనీర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి త్వరలో ప్రజలకు అందుబాటులో కి తెచ్చేలా పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు





