నేటి సాక్షి వికారాబాద్:వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పసియోద్దీన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ జిల్లా 2వ మహాసభలో ఆయన ప్రధాన వక్తగా మాట్లాడుతూమెడికల్ అండ్ హెల్త్ లో ఏ ఎన్ ఏం లు 104, 108 ఇతర కాంట్రాక్టర్ ఔట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులను వెంటనే పర్మిట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ వైద్యరంగంలో 1930 ఏఎన్ఎం పోస్టులు 2300 నర్సింగ్ ఆఫీసర్స్ 1284 ఎల్ టి పోస్టులు 735 ఫార్మాసిస్టు పోస్టులు ఖాళీగా ఉన్న ప్రభుత్వ మాత్రం వాటిని భర్తీ చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టు కార్మికులు తీవ్రంగా నష్టపోయారు పాలకులు మారితే జీవితాలు బాగుపడతాయని ఆశపడ్డ కార్మికులకు నిరాశే మిగిలిందని ఆయన అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నూతన ప్రజా ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి కార్మికులను ఆదుకోవాలని ఆయన ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన పోరాటాలు తీవ్రతరం చేస్తామని అన్నారు. అనంతరం నూతన జిల్లా కమిటీ ఎన్నుకోవాడాము జరిగింది. అధ్యక్షురాలిగా వెంకటమ్మ, కార్యదర్శిగా లీలావతి, కోశాధికారిగా రజియా, ఉపాధ్యక్షురాలుగా స్రవంతి, మంగమ్మ, 104 శ్రీనివాస్, సహాయ కార్యదర్శిలుగా భారతి సుహాసిని,104 మహేందర్ కమిటీ సభ్యులుగా వైదేవి, సమాధాన, నిర్మల,, అనిత, సత్యమ్మ, అపర్ణ, స్వరూప అనంతలక్ష్మి, సులోచన, జ్యోతి, కవిత, రోజా లను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ శ్రీనివాసు ఉపాధ్యక్షులు చంద్రయ్య మహిపాల్ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. Ol





