నేటి సాక్షి:– రాష్ట్రంలో 134 మోడల్ స్కూల్ హాస్టల్ లో కోవిడ్ -19 సందర్భంగా మార్చి 2020 నుండి 8 నెలల పాటు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అనేక ఇబ్బందులతో ప్రాణాలు సైతం పనంగా పెట్టి హాస్టల్ లో బస చేసి బాధితులకు సేవా పని చేశారని అలాంటి మహిళా ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేదని తక్షణమే ఎనిమిది నెలల పెండింగ్ వేతనాలు చెల్లించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం రమేష్ బాబు డిమాండ్ చేశారు.. గురువారం పటమట లోని సర్వ శిక్ష అభియాన్ రాష్ట్ర కార్యాలయంలో ఎస్ ఎస్ ఏ రాష్ట్ర అడిషనల్ స్పెషల్ ప్రాజెక్టు డైరెక్టర్ దేవానందరెడ్డి గారికి వినతి పత్రం అందించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల క్రితం కరోనాను లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి మహిళా ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా 134 ఆదర్శ పాఠశాల వసతి గృహాల్లో అనేక సేవలు చేశారని, ప్రభుత్వ ఆదేశాల మేరకు నడిచారని అలాంటి వారికి వేతనాలు ఇవ్వడంలో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.. గతంలో విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి ఈ విషయంపై వినతిపత్రం అందించి సమస్య తెలపడం జరిగిందని రాష్ట్రస్థాయి అధికారులు ఈ విషయంపై ఆలోచించాలని వారు కోరారు.. చాలీచాలని వేతనాలతో పని గంటల విధానం లేక కుటుంబాలను వదిలి అనేక అవస్థలు పడి వీరు పనిచేస్తున్నారని రాత్రి వేళల్లో హాస్టల్లోనే బస చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అలాంటి వారికి పెండింగ్లో వేతనాలు ఉంచడం తగదన్నారు..కుటుంబ పోషణ భారంగా మారిందాన్నారు. వేతనాలు పెంపుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అప్కాస్ నుండి కాంట్రాక్టు ఉద్యోగులుగా పరిగణించాలని వారు డిమాండ్ చేశారు. వెంటనే ప్రభుత్వం విధుల్లో పని చేసిన వివరాలు సేకరించి వీరికి వేతనాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కు సిద్ధపడుతుందని వారి హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు మహేష్ సోము తదితరులు పాల్గొన్నారు..





