నేటి సాక్షి, బాపట్ల జిల్లా (పర్చూరు)నిస్వార్థంగా కష్టపడే ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ పార్టీలో సముచితమైన స్థానం, గౌరవం లభిస్తుందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు.గురువారం ఎమ్మెల్యే ఏలూరి క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలో నూతన మండల, క్లస్టర్, యూనిట్, గ్రామ, బూత్ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఎమ్మెల్యే ఏలూరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి క్లస్టర్, యూనిట్, బూత్ స్థాయిలో రూపొందించిన వ్యవస్థ కీలక పాత్ర పోషించిందన్నారు. ఈ వ్యవస్థ ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా చేరాయన్నారు. పార్టీ కోసం నిరంతరం ప్రతి కార్యకర్త కృషి చేశారన్నారు. ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న వారికి. ఇది కేవలం పదవి కాదు వారికి ఇచ్చిన గౌరవం అన్నారు.*ప్రతి ఒక్కరికి గుర్తింపు*పార్టీకి కష్టపడిన వారందరికీ గుర్తింపు లభిస్తుందని స్పష్టం చేశారు. పార్టీలో అందరూ సమానమే. ప్రతి ఒక్కరి త్యాగానికి భవిష్యత్తులో తప్పకుండా గౌరవం లభిస్తుందన్నారు. మనందరి లక్ష్యం ఒకటే రాష్ట్రాభివృద్ధి, తెలుగుదేశం బలోపేతం” అన్నారు.*వైసిపి దుష్ప్రచారానికి తిప్పికొట్టాలి*”వైసిపి చేస్తున్న దుష్ప్రచారాన్నీ ప్రతి కార్యకర్త తిప్పి కొట్టాలన్నారు. పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి. ప్రజలకు నిజమైన అభివృద్ధి, ప్రగతిని అందించాలన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నదని గుర్తు చేయండి” అని సూచించారు.*స్థానిక ఎన్నికల్లో విజయం లక్ష్యం*రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే ప్రధాన ధ్యేయంగా పని చేయాలి ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి బూత్‌లో మన అభ్యర్థులు విజయం సాధించేలా అందరూ కలసికట్టుగా కృషి చేయాలన్నారు. ఈ స్థానిక ఎన్నికల ఫలితమే పార్టీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది,” అని అన్నారు.*కార్యకర్తలకు స్పష్టమైన సందేశం*ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగింపు సందర్భంగా, నూతనంగా ఎన్నికైన మండల, క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీ సభ్యులు పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి నిబద్ధతతో పనిచేస్తామని ప్రమాణం చేశారు.కార్యకర్తల సహకారం, సమన్వయం ద్వారా తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఎమ్మెల్యే ఏలూరి విశ్వాసం వ్యక్తం చేశారు.*అరుదైన గౌరవం*పార్టీ కష్ట కాలంలో అహర్నిశలు కృషిచేసిన ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యే ఏలూరి అభినందించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కెట్ కమిటీ, పిఎసిఎస్, సాగునీటి సంఘాల డిస్ట్రిబ్యూటర్ కమిటీ, దేవాలయాల కమిటీలు, రాష్ట్ర కార్పొరేషన్ పదవులలో నియమించినట్లు చెప్పారు.*కోట్లాది రూపాయల అభివృద్ధి* నియోజకవర్గంలో రూ.80 కోట్లతో సిసి రోడ్లు రూ.8 కోట్లతో గోకులాలు, రూ 60 కోట్లతో ఆర్ అండ్ బి రోడ్లు, 16 కోట్లతో పిఐయూ రోడ్లు, 1170 మందికి 10 కోట్ల తో సీఎం సహాయనిది, రూ.3 కోట్లతో కే డబ్ల్యూ డి అభివృద్ధి, కోటిన్నరతో ఎన్ ఎస్పీ కాలువలు,రూ.3.50 కోట్లతో డ్రైనేజీలు అభివృద్ధి ఇలా కోట్లాది రూపాయలతో నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేసినట్లు ఎమ్మెల్యే ఏలూరి వెల్లడించారు.*ఘనంగా వేడుక….*బూతు క్లస్టర్ యూనిట్ గ్రామ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవ వేడుక కన్నుల పండుగ జరిగింది. వేలాది మంది కార్యకర్తలతో ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయం పండుగ వాతావరణం తలపించింది.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నూతన కమిటీ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు. అలాగే రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు తిరుమల శెట్టి శ్రీహరి, షేక్ శంషుద్దీన్, కోడూరి శేష బ్రహ్మచారి, కారుమంచి కృష్ణ , హుస్సేన్ లను పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుంజి వెంకటరావు, మండల పార్టీ అధ్యక్షులు తాటి నాగేశ్వరరావు, నాయుడు హనుమంతరావు, నల్లపునేని రంగయ్య చౌదరి, షేక్ సంసుద్దీన్ , తిరుమల శెట్టి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.





