Wednesday, March 18, 2026

*సంగెం గ్రామంలో వెలుగులు నింపిన సంజయ్ అన్న.!**మూడు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు* కరెంట్‌ సమస్యకు చెక్‌*

నేటి సాక్షి – కోరుట్ల*(రాధారపు నర్సయ్య)కోరుట్ల మండలం సంగెం గ్రామంలో నెలల తరబడి బాధపెట్టిన కరెంట్‌ సమస్యకు ఇక చెక్‌ పడింది.! గ్రామంలో విద్యుత్‌ సరఫరా అంతరాయాలు, తక్కువ వోల్టేజ్‌ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు పెద్ద ఊరట లభించింది.*మూడు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు*స్థానిక ఎమ్మెల్యే సంజయ్ అన్న ప్రత్యేక శ్రద్ధతో విద్యుత్‌ శాఖ అధికారుల సహకారంతో 25 కేవీ సామర్థ్యం గల మూడు కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు గ్రామంలో ఏర్పాటు చేయించారు. దీని వల్ల గ్రామంలోని ప్రతి వీధి, ప్రతి ఇల్లు వెలుగులతో మెరవనుంది.*బిఆర్ఎస్ నాయకుల కృతజ్ఞతలు*ఈ సందర్భంగా గ్రామ బిఆర్ఎస్ అధ్యక్షులు సుదవేణి భూమయ్య మాట్లాడుతూ..మా సంగెం గ్రామం కరెంట్‌ సమస్యతో చాలా కాలంగా ఇబ్బంది పడుతూ వచ్చింది. కానీ ఎమ్మెల్యే సంజయ్ అన్న స్పందించి వెంటనే మూడు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయించడంతో ఇక మాకు కరెంట్‌ ఇబ్బంది ఉండదు. మా గ్రామ ప్రజల తరఫున ఆయనకు, విద్యుత్‌ శాఖ ఏఈ కి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.*ప్రజల్లో సంతోషం.!*కొత్త ట్రాన్స్‌ఫార్మర్లతో గ్రామంలోని విద్యార్థులు, వ్యాపారులు, రైతులు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో కూడా విద్యుత్‌ అంతరాయం లేకుండా సౌకర్యవంతంగా పని చేసుకునే పరిస్థితి ఏర్పడింది.ఇప్పుడు మా సంగెం గ్రామం వెలుగులతో నిండిపోయింది..సంజయ్ అన్నకు ధన్యవాదాలని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.________

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News