Wednesday, March 18, 2026

తెలంగాణ దోపిడీని పాట రూపంలో తెలిపిన మహర్షి…”కాళోజి”

నేటిసాక్షి, మిర్యాలగూడ : తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం, తెలుగు భాషా బలోపేతం కోసం కాళోజి నారాయణరావు చేసిన కృషి నేటి యూవతకు స్ఫూర్తిదాయకమని సామాజిక వేత్త డాక్టర్ రాజు, ఉద్యమ కర్త కస్తూరి ప్రభాకర్ అన్నారు. గురువారం కాళోజి నారాయణ రావ్ వర్ధంతి సందర్బంగా పట్టణంలోని మేరెడ్డి రాంచంద్రారెడ్డి గ్రంధాలయంలో కాళోజీ చిత్రపటానికి పూలదండ, వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆంధ్రుల పాలనలో తెలంగాణకు జరుగుతున్న నష్టాలను పాటల రూపంలో రాసి ప్రజలను చైతన్యపరిచారని, తెలుగు భాషా పరిరక్షణ కోసం అనేక గ్రంధాలను రాసి అవహగాహన కల్పించారు. అయన ఆశయం సాధన కోసం యువత కృషి చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్, యాదవ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి చెగొండి మురళి యాదవ్, కుమ్మరికుంట్ల సుధాకర్, లవన్, క్రాంతి, వెంకటేష్, నాగార్జున, అఖిల్, రాంబాబు, సూర్య, నాగరాజు, పవన్, మధు, విజయలక్ష్మి, మమత, గాయత్రి, చందన, సునీత తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News