Wednesday, March 18, 2026

*గుండ్లపల్లి రాజీవ్ రహదారిపై మహ ధర్నా* *డబుల్ రోడ్డు కోసం మహాధర్నా పోస్టర్ ఆవిష్కరించిన యువజన సంఘాలు.*

నేటి సాక్షి,గన్నేరువరం, ( బుర్ర అంజయ్య గౌడ్): డబుల్ రోడ్డు కోసం ఈనెల 16న గుండ్లపల్లి రాజీవ్ రహదారిపై యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టబోయే మహాధర్న విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం గన్నేరువరం మండల కేంద్రంలో నిరసన చేపట్టి డబుల్ రోడ్డు కోసం మహాధర్నా పోస్టర్ ఆవిష్కరించారు. రోడ్డు వేస్తారా ప్రాణాలు తీస్తారా అంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుండ్లపల్లి నుండి పోత్తూరు వరకు 71 కోట్లతో డబుల్ రోడ్డు మంజూరై మూడేళ్లు గడుస్తున్నా రోడ్డు పనులు పూర్తి కాలేదని కాంట్రాక్టర్ కంకర పోసి వదిలేయడంతో ప్రయాణికులు ప్రజలు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న అధికారులు నాయకులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ రోడ్డు వేసేంతవరకు తమ పోరాటం ఆగదని యువజన సంఘాల నాయకులు హెచ్చరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News