Wednesday, March 18, 2026

*చివరి గింజ వరకు రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయాలి*—-* మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్* సమస్యలకు తావు లేకుండా గ్రౌండ్ లెవల్ లో అధికారులు కట్టుదిట్టంగా ఉండాలి—–*

నేటి సాక్షి – జగిత్యాల*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో గురువారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన ధాన్యం కొనుగోలు సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, అదనపు కలెక్టర్లు బి.ఎస్. లత, రాజగౌడ్ లతో పాటు రైస్ మిల్లర్ల అసోసియేషన్, ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.*చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం.!*ఈ సమావేశంలో మంత్రి అడ్లూరి మాట్లాడుతూ..జగిత్యాల జిల్లా రైతుల వద్ద ఉన్న చివరి గింజవరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలనే నిశ్చయంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. గన్ని బ్యాగులు, టార్పాలిన్ కవర్లు, యంత్రాలు వంటి సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని, ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.—*తడిచిన ధాన్యానికి ప్రత్యేక మిషన్లు*అకాల వర్షాల ప్రభావంతో తడిచిన ధాన్యాన్ని రక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి మండలాలకు ఒక్కో తడి ధాన్యం అరబెట్టే మిషన్ కేటాయించబడిందని చెప్పారు. అవసరమైతే మరో ఏడు మిషన్లకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. తడిచిన లేదా రంగు మారిన ధాన్యాన్ని కూడా నిబంధనల ప్రకారం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.*వాహనాలు నిలిచిపోతే మిల్లర్లదే బాధ్యత*ధాన్యం రవాణాలో ఏ అడ్డంకులు వచ్చినా రైతులను ఇబ్బంది పెట్టరాదని మంత్రి స్పష్టంచేశారు.మిల్లర్ల వద్ద వాహనాలు నిలిచిపోతే అది వారి బాధ్యతగా పరిగణిస్తామని పేర్కొన్నారు.ప్రతి కొనుగోలు కేంద్రంలో ఇన్‌చార్జ్‌లు, అధికారులు పూర్తి బాధ్యతతో వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపారు.*రైతుల సమస్యలు తక్షణమే పరిష్కారం*ప్రతి సెంటర్ వద్ద రైతుల సమస్యలు తలెత్తకుండా గ్రౌండ్ లెవల్ అధికారులను నిరంతరం పర్యవేక్షణలో ఉంచాలని సూచించారు.సమస్యలుంటే వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకురావాలని, సింగిల్ విండో చైర్మన్‌లు రైతులతో సన్నిహితంగా పని చేయాలని ఆదేశించారు.రైతుల పక్షాన ప్రభుత్వం ఎల్లప్పుడూ నిలబడుతుందని మంత్రి అన్నారు.*సమన్వయంతో ధాన్యం కొనుగోళ్లు విజయవంతం చేయాలి*జిల్లా అధికారులు, నిర్వాహకులు, మిల్లర్లు, రవాణా కాంట్రాక్టర్లు సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు.15 రోజుల్లో మరో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి అప్పటివరకు ఎదురైన సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.మొక్కజొన్న రైతుల సమస్యలపై మార్క్‌ఫెడ్ అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.అదేవిధంగా జిల్లా మంత్రిగా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటానని, అందరూ కలిసి పనిచేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని మంత్రి అన్నారు.—*ఎమ్మెల్యేల సూచనలు..*(జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్)ప్రతి సంవత్సరం ప్యాడీ ఉత్పత్తి పెరుగుతోందని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో వ్యవహరించాలన్నారు.—(కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్)రోజుకు 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, దీన్ని 15 వేల మెట్రిక్ టన్నుల వరకు పెంచితే వేగవంతంగా కొనుగోలు పూర్తవుతుందని సూచించారు. కౌలు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు.*ధాన్యం సేకరణపై జిల్లా కలెక్టర్ వివరాలు*జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ, ఈ సీజన్‌లో మొత్తం 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రావచ్చని, వర్షాల ప్రభావంతో 4–4.5 లక్షల మెట్రిక్ టన్నుల వరకు వచ్చే అవకాశం ఉందన్నారు. మొత్తం 436 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, అందులో 394 ఇప్పటికే ప్రారంభమయ్యాయని వివరించారు.ఇప్పటివరకు 56 కోట్ల రూపాయల విలువ గల ధాన్యం కొనుగోలు నమోదైందని, అందులో 28 కోట్ల విలువైన ధాన్యానికి రైతుల వివరాలు నమోదు అయ్యాయని, 7 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు.*ప్రతి మండలానికి ప్రత్యేక అధికారులు*ప్రతి మండలానికి స్పెషల్ ఆఫీసర్లు, క్లస్టర్లకు క్లస్టర్ ఆఫీసర్లు నియమించారని కలెక్టర్ తెలిపారు.రైతులు ధాన్యాన్ని తెచ్చిన వెంటనే వారి వివరాలు నమోదు చేస్తే 24–48 గంటల్లో నగదు చెల్లింపు జరగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.*సెంటర్‌ల వారీగా కొనుగోలు వివరాలు*మొత్తం 436 సెంటర్లలో 299 ప్యాక్స్ ఆధ్వర్యంలో, 136 ఐకేపీ సెంటర్లలో, ఒకటి మెప్మా ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.ప్యాక్స్ సెంటర్లలో గ్రేడ్-ఏ రకం 1,34,940 క్వింటాళ్లు, సన్న రకం 1,280 క్వింటాళ్లు కొనుగోలు చేశారు.ఐకేపీ సెంటర్లలో 6 లక్షల క్వింటాళ్లలో 1.6 లక్షల క్వింటాళ్ల మాయిశ్చరైజేషన్ పూర్తయ్యింది.ఒక లక్ష క్వింటాళ్లకు నగదు రైతుల ఖాతాల్లో జమ అయిందన్నారు.*అదనపు కలెక్టర్ బి.ఎస్. లత స్పష్టీకరణ*ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన గన్ని బ్యాగులు, టార్పాలిన్‌లు, హార్వెస్టర్లు, యంత్రాలు అన్ని అందుబాటులో ఉన్నాయని తెలిపారు.హమాలీల కొరత తలెత్తిన ప్రాంతాల్లో EGS కూలీలను ఉపయోగించి పనులు సజావుగా కొనసాగించాలి అన్నారు.మిల్లర్లు, ట్రాన్స్‌పోర్ట్ యజమానులు సమన్వయంతో వాహనాల సంఖ్య పెంచి లారీల రవాణా వేగవంతం చేయాలని సూచించారు.జగిత్యాల, మెట్‌పల్లి ఆర్డీవోలు మధుసూదన్, శ్రీనివాస్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కన్నం హరిణి, వివిధ శాఖాధికారులు, క్లస్టర్ అధికారులు, ప్యాక్స్ చైర్మన్లు, రైస్ మిల్లర్ అసోసియేషన్ సభ్యులు, ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు._________

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News