నేటి సాక్షి తిరుపతి(బాదూరు బాల) కరకంబాడి రోడ్డులోని బొంతాలమ్మ గుడి వద్ద ఉన్న వినాయక సాగర్ పార్కు, గ్లో గార్డెన్ ప్రవేశరుసుము వసూలుకు వేలంలో 3,10,666 రూపాయలు పలికిందని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య తెలిపారు.. కరకంబాడీ మార్గంలోని వినాయక సాగర్, గ్లో గార్డెన్ లోనికి ప్రవేశ రుసుము వసూలు చేసుకొనే హక్కులు కొరకు, వినాయక సాగర్ పార్కులోని గేమ్ జోన్ నిర్వహణకు, వినాయక సాగర్ పార్కునకు, స్విమ్మింగ్ పూల్ కు మరియు బొంతాలమ్మ గుడి ప్రక్కన నిర్మించిన షాపులకు వచ్చు సందర్శకుల నుండి పార్కింగ్ రుసుము వసూలు చేసుకొను హక్కు కొరకు, వినాయక సాగర్ పార్కులోని స్విమ్మింగ్ పూల్ నిర్వహణ కొరకు మూడు సంవత్సరముల కాలమునకు లీజు పద్ధతిపై ఇచ్చుటకు సీల్డ్ టెండరు, బహిరంగ వేలమును కమిషనర్ సమక్షంలో గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించారు. ఈ వేలంలో గేమ్ జోన్ నిర్వహణకు ఎవ్వరూ ఆసక్తి చూపనందున, పార్కు వద్ద గల స్విమ్మింగ్ పూల్ నిర్వహణకు బహిరంగ వేలమునకు ఒక్క టెండరు మాత్రమే వచ్చినది, సదరు టెండరు గెజిట్ లోని నిబంధనలకు లోబడి రానందున వాయిదా వేయడమైనట్లు తెలిపారు. వినాయకసాగర్ పార్కు మరియు గ్లో గార్డెన్ ప్రవేశరుసుము వసూలుకు శరవణ కుమార్ 3.10 లక్షల రూపాయలతో హెచ్చు పాటదారుడుగా నిలిచారు. వినాయక సాగర్ పార్కు, స్విమ్మింగ్ పూల్, షాపింగ్ కాంప్లెక్స్ వచ్చు సందర్శకుల నుండి పార్కింగ్‌కు టెండరు, బహిరంగ వేలము నందు హెచ్చు పాటదారుడుగా 1.35 లక్షల రూపాయలతో కృష్ణారెడ్డి హెచ్చు పాటదారుడు నిలిచారు. ఇందులో హెచ్చు పాటదారులైన వారికి కేటాయించారు. ఈ వేలం పాటలో డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, కార్పొరేటర్ ఎస్. కె.. బాబు, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, రెవిన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, తదితరులు పాల్గొన్నారు.

