Wednesday, March 18, 2026

ఈ నెల 15 వరకు జరుగనున్న జాతీయ లోక్-అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి.. రాజీ మార్గమే.. రాజ మార్గం! రాజీపడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో కక్షిదారులు రాజీ పడవచ్చు… జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి.

నేటి సాక్షి వికారాబాద్:జిల్లా లో జాతీయ లోక్ ఆధాలాత్ సదివినియోగం చేసుకోవాలని ఎస్పి ఒక ప్రకటనలో మాట్లాడుతూ క్షణికావేశంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ అనేది ఒక మంచి అవకాశం, అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని అన్నారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న, రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో కక్షిదారులు రాజీపడేలా లోక్ అదాలత్ దోహదపడుతుందని, ఈ నెల 15 వ తేది వరకు జరగనున్న జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు సూచించడం జరిగింది.రాజీ పడదగిన కేసులు, క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన కేసులు, వైవాహిక జీవితం సంబంధిత కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ వంటి కేసుల్లో ఇరువర్గాల సమ్మతితో రాజీకి కుదుర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నారు. సైబర్ నేరాలకు సంభందించి, బాధితులు కోల్పోయిన డబ్బులు త్వరగా భాదితులకు అందే విధంగా చూడాలని, 25 వేల రూపాయల కంటే తక్కువ డబ్బు కోల్పోయిన కేసులలో లోక్-అదాలత్ ద్వారా ఫిర్యాదు చేసుకొని, ఎఫ్ఐఆర్ లేకుండానే రీఫండ్ ప్రక్రియా చేసుకోవచ్చని అన్నారు. జాతీయ లోక్ అదాలత్ విజయవంతం అయ్యేలా అధికారుల నుండి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరు భాద్యత యుతంగా వ్యవహరించి, రాజీ పడదగిన అన్ని కేసులలో ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించి, వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీపడేలా చూడాలన్నారు. జాతీయ లోక్-అదాలత్ ద్వారా సత్వర పరిష్కారం జరుగుతుందని అవగాహన కల్పించాలని సూచించడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News