Wednesday, March 18, 2026

బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

నేటి సాక్షి, బెజ్జంకి:బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన రైతు బండి ఐలయ్య ఇంటి ఆవరణలో ఆరబెట్టిన సుమారు 350 క్వింటాళ్ల పత్తి ఇటీవల ప్రమాదవశాత్తూ మంటల్లో కాలి బూడిదై భారీ నష్టం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ శుక్రవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక రైతు కుటుంబంపై ఇంత పెద్ద నష్టం పడటం బాధాకరమన్నారు. దగ్ధమైన పత్తి విలువ సుమారు 30 లక్షలు ఉంటుందని, ప్రభుత్వం వెంటనే అధికారులు వెళ్లి పంట నష్టాన్ని అంచనా వేసి రైతుకు ఆర్థిక సాయం తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు.మాజీ ఎమ్మెల్యేతో పాటు భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు లింగాల లక్ష్మణ్, కనగండ్ల తిరుపతి, చింతకింది శ్రీనివాస్ గుప్తా, రావుల రామకృష్ణ రెడ్డి, ఎల శేఖర్ బాబు, ధీటి రాజు, బిగుల్ల మోహన్, కల్లూరి అజయ్ యాదవ్, లింగాల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News