నేటి సాక్షి, బాపట్ల జిల్లా (చందోలు)హెల్మెట్ వినియోగంతో ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుందని హెల్మెట్ తలకు భారం కాదని రక్షణ ఇస్తుందని చందోలు ఎస్సై మర్రి వెంకట శివకుమార్ అన్నారు.బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చందోలు హైవేలో శుక్రవారం వాహన చందులు ఎస్ఐ శివకుమార్ తనిఖీలు నిర్వహిస్తున్నారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనం నడిపి ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనానులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనానికి సంబంధించిన వాహన పత్రాలు వెంట ఉండాలని సూచించారు.అలాగే మద్యం సేవించే వాహనం నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మైనర్లకు వాహనాలు ఇవ్వడం ద్వారా ప్రమాదలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు ఎవరు మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని తల్లిదండ్రులకు అభ్యర్థించారు. రోడ్డు ప్రమాదంలో ఎవరు ప్రాణాపాయం చెందకూడదనే సంకల్పంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని యువత మానసిక ఆరోగ్యం, మత్తు దుర్వినియోగం ప్రభావాలు, రోడ్ సేఫ్టీ, యువతలో చైతన్యం వంటి ముఖ్య అంశాలపై చందోలు ఎస్సై మర్రి వెంకట శివకుమార్ ప్రసంగించారు.యువత తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని సమాజ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. రోడ్లపై జాగ్రత్తగా నడుచుకోవడం, హెల్మెట్ సీటుబెల్ట్ వినియోగం వంటి భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలనీ, ప్రతి ఒక్కరు బాధ్యతతో వ్యవహరించాలని ఆయన అన్నారు.





