నేటి సాక్షి, బాపట్ల జిల్లా ప్రతినిధి మధుమేహంపై అవగాహన, నివారణ, నియంత్రణ కోసం చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ అన్నారు.బాపట్ల నవంబర్ 14న నిర్వహించే ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని, జిల్లా వైశ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ సూచన మేరకు శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ ఆవరణలో మధుమేహం వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు, స్క్రీనింగ్ క్యాంప్ ను నిర్వహించడం జరిగినది.ఈ సందర్భంగా జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ విజయమ్మ మాట్లాడుతూ ప్రజలలో మారుతున్న జీవనశైలి కారణంగా మధుమేహం ఇప్పుడు అన్ని వయస్సుల వారిని, ముఖ్యంగా యువతను ఎక్కువగా ప్రభావితం చేస్తోంది అని తెలియజేశారు. భారతదేశంలో మధుమేహ బాధితుల సంఖ్య 10.1 కోట్లకు చేరింది కాబట్టి ప్రజలందరూ ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకుంటే ముఖ్యంగా సరైన ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బరువును నియంత్రించడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు అని అన్నారు..





