Wednesday, March 18, 2026

“గర్భిణీ లకు భరోసా -102 అమ్మ ఒడి వాహనాలు “”102 -అమ్మ ఒడి వాహనాలు జిల్లా ప్రజలు వినియోగించుకోవాలి సూపర్వైజర్ రాఘవేంద్ర”102 అమ్మ వడి సిబ్బంది సేవలు బాగున్నాయి- డిఎం అండ్ హెచ్ ఓ జయ చంద్రమోహన్

నేటి సాక్షి,నారాయణపేట, నవంబర్ 14 నారాయణపేట జిల్లాలోని వివిధ మండలాలలో 102 అమ్మఒడి, 8( మక్తల్-2, మద్దూర్-1, నారాయణపేట -2,మరికల్-1, ధన్వాడ -1, కోస్గి -1)వాహనాలు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి గర్భిణీ గర్భం దాల్చిన అప్పటి నుంచి డెలివరీ అయ్యేంతవరకు, వారిని దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి రక్త పరీక్షల కోసం లేదా స్కానింగ్ ల కోసం, మరియు చిన్న పిల్లలకు వ్యాక్సిన్ కోసం, ప్రభుత్వ హాస్పిటల్ లో సిజరిన్లు అయిన తర్వాత వారి యొక్క కుట్లు కూడా 102 నెంబర్ కి కాల్ చేస్తే వారే వచ్చి మీ ఇంటి దగ్గర నుంచి మిమ్మల్ని ఆ వాహనంలో జాగ్రత్త దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు అక్కడ అక్కడ డాక్టర్లు పరీక్షించిన తర్వాత,పరీక్షల నిమిత్తం మళ్లీ వారినే ఉచితంగా హాస్పిటల్ నుంచి వారి స్వగ్రామానికి ఉచితంగా తరలిస్తున్నారు, గర్భిణీ స్త్రీలకు 102 అమ్మఒడి వాహనాలు వారికి ఎంతగానోఉపయోగపడుతున్నా ప్రజలు ప్రభుత్వానికి మరియు జీవీకే ఈఎంఆర్ఐ సంస్థ అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు,

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News