Wednesday, March 18, 2026

*పవన్ కళ్యాణ్ నీ విమర్శించే స్థాయి వైసీపీ లేదు** విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు విన్నకోట సురేష్ వెల్లడి

నేటి సాక్షి, బాపట్ల జిల్లా (బాపట్ల టౌన్)రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిధున రెడ్డికి లేదని జనసేన నాయకులు సురేష్ అన్నారు.. బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ; ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. శేషాచల అటవీ ప్రాంతంలోని మంగళంపేట అటవీ భూముల్లో భారీ ఎత్తున కబ్జాలకు సంబంధించిన ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో స్పష్టంగా అడవిలో సుమారు రెండు లక్షల ఎర్రచందనం చెట్లకు పైనే ఆక్రమణకు గురైనట్లు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అని, ఫారెస్ట్ లో విశాలాంధ్రమైన భవనం ఎలా నిర్మించాలని ఆ భవనానికి అనుమతులు ఉన్నాయని ప్రశ్నించారు.. పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ఎక్స్ వేదికలో ఉప ముఖ్యమంత్రి పై విమర్శలు సెటైర్లు వేయటం వారి అవినీతిని కప్పపుచ్చుకోవడమేనని ఆయన ధ్వజమెత్తారు..ఫారెస్ట్ లో సుమారు 2000 సంవత్సరంలో 76.74 ఎకరాలను కొనుగోలు చేశామని మరే అన్నారు.. మీరు కొనుగోలు చేసిన భూమి ని రీ సర్వే చేస్తే 103 ఎకరాలు ఎలా వచ్చిందని పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని ప్రశ్నించారు. 33 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేశారని ఆయన అన్నారు. ఫారెస్ట్ ల్యాండ్ ని ఏ చట్ట ప్రకారం మీరు కొనుగోలు చేశారు మిధన్ రెడ్డి అని ప్రశ్నించారు. కబ్జా చేసిన స్థలంలోనే అక్రమ నిర్మాణాలు నిర్మించుకున్నారని ఆయన అన్నారు…ఈ భూములన్నీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి సంబంధించినవే కదా! అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ధైర్యంతో ప్రజలకు నిజాన్ని తెలియజేశారని తెలిపారు.. నిజాలు మాట్లాడిన పవన్ కళ్యాణ్ పై విమర్శించడం సరికాదని తిరుపతి రావడానికి మీ కుటుంబం భయపడుతుందని ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎర్రచందనం దుంగలను ఇతర రాష్ట్రాలకు దేశాలకు తరలించిన ఘనత మీకే చెందుతుందని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ నిజాయితీకి నిబద్ధతకు నిలువెత్తు రూపం ప్రజల కోసం నిజాయితీగా పని చేస్తూ తన జీతాన్ని కూడా చిన్నారులకు ఖర్చు పెడుతున్నారని, ట్రైబల్ ఏరియా ను సందర్శించి వారికి కావలసిన సదుపాయాలను రోడ్లు ఆఖరికి చెప్పులు బెడ్ షీట్లు తినడానికి పదార్థాలు తన సొంత ఖర్చుతో పంపించిన వ్యక్తిని మీరు ఎక్స్ లో ట్రోల్ చేస్తే రాష్ట్ర ప్రజలు నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరని పైకి ఉమ్మేస్తే అది మీ మీదే పడుతుందని గుర్తు చేశారు.. మీరు చేసిన అవినీతి త్వరలోనే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బయటపెడతారని ఆయన గుర్తు చేశారు. నీతి నిజాయితీ నిలువెత్తు రూపం పవన్ కళ్యాణ్ అని అన్నారు.. మీరు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎంత అవినీతి అక్రమాలు చేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అని ఆయన గుర్తు చేశారు.. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గట్టుపల్లి తులసి కుమారి, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News