Wednesday, March 18, 2026

గుజరాత్ లో సైబర్ మోసగాళ్ల పట్టివేత నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన కాగజ్ నగర్ టౌన్ పోలీసులను, డి.ఫోర్.సి బృందాన్ని ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీఆన్లైన్, సైబర్ క్రైమ్ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్త వహించండి- జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐ.పి.ఎస్

నేటి సాక్షి కొమరం భీమ్ ఆసిఫాబాద్ ప్రతినిధి నవంబర్ 14కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్ నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన సైబర్ క్రైమ్ కేసు కు సంబంధించిన ముగ్గురు నిందితులను పట్టుకున్నట్లు కాగజ్ నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో .జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. తేదీ:19.08.2025 న కాగజనగర్ కు చెందిన గద్దల కిరణ్ కుమార్ ఇచ్చిన పిర్యాదు మేరకు కాగజనగర్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయటం అయింది. సైబర్ క్రైమ్ నిందితులను పట్టుకునేందుకు కాఘజనగర్ టౌన్ ఎస్‌ఐ ప్రశాంత్ తో పోలీస్ ప్రత్యేక బృందం గుజరాత్ రాష్ట్రానికి పంపడమైనది. అక్కడ జరిగిన దర్యాప్తులో ముగ్గురు నిందితులు గుర్తించి, నిందితులను విడివిడిగా విచారించాము.1) కడవల భవేశ్ సీదా భాయ్ (27 సంవత్సరాలు) నిందితుడుటైలరింగ్ పనిచేస్తూ అహ్మదాబాద్‌లో నివసిస్తున్న భవేశ్‌ను విచారించగా, తన వివరాలు ఆధార్/పాన్ సాయంతో ఐ డి ఎఫ్ బి ఫస్ట్.బ్యాంకులో కరెంట్ అకౌంట్ తెరవించి, ఆ అకౌంట్‌ను రాథోడ్ రాహుల్ నిర్వహించేవాడని తెలిపాడు. అకౌంట్‌లో వచ్చిన మొత్తాలను చెక్ ద్వారా డ్రా చేసి రాహుల్‌కు అందజేస్తూ, ప్రతిసారి కమీషన్‌గా రూ. 3,000/- పొందేవాడని ఒప్పుకున్నాడు. 30.04.2025 న రూ. 50,000/- తన అకౌంటులో జమ కాగా, మొత్తం రూ. 1,32,000/-ను రాహుల్‌కు ఇచ్చినట్లు తెలిపాడు. మధ్యాహ్నం 12:00 గంటల సమయంలో స్థానిక పోలీసులు, తెలంగాణ పోలీసులతో కలిసి తమ ఇంటి వద్ద తనను పట్టుకున్నారని తెలిపాడు.2) రాథోడ్ రాహుల్ హాజ భాయ్ (28 సంవత్సరాలు) – నిందితుడుకూలీ పనులు చేసుకునే రాహుల్‌ను విచారించగా, సాహు ప్రదీప్ సూచన మేరకు భవేశ్‌ చేత అకౌంట్ తెరవించి కమిషన్‌గా రూ. 9,000/- పొందినట్టు తెలిపాడు. అకౌంట్‌లో జమకాబడిన మొత్తాన్ని చెక్ ద్వారా డబ్బుగా తీసి సాహు ప్రదీప్‌కు అందజేసేవాడని ఒప్పుకున్నాడు. మధ్యాహ్నం 12:00 గంటలకు భవేశ్ ఇంటి వద్ద నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారని తెలిపాడు. తర్వాత మా బృందానికి సాహు ప్రదీప్‌ను చూపడానికి ముందుకు వచ్చి, అంబికా ఐస్ క్రీమ్ షాప్ వద్ద అతడిని గుర్తు చూపాడు.3) సాహు ప్రదీప్ (21 సంవత్సరాలు) నిందితుడువిద్యార్థి అయిన ప్రదీప్‌ను విచారించగా, అభిషేక్ సోలంకి సూచన మేరకు అకౌంట్లు తెప్పించి, వాటి ద్వారా జరిగే ట్రాన్సాక్షన్లపై కమిషన్ పొందుతున్నట్టు ఒప్పుకున్నాడు. భవేశ్ మరియు రాహుల్‌ను ఈ విధంగా ప్రేరేపించి అకౌంట్లు తెరవించాడని తెలిపాడు. గత కొంతకాలంగా ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తూ ఉన్నట్లు వెల్లడించాడు. ముగ్గురు నిందితుల నేర ఒప్పుదల అనంతరం సైబర్ నేరంలో ఉపయోగించిన బ్యాంక్ అకౌంట్లు, లావాదేవీల వివరాలు సేకరించి, కేసుకు సంబంధించిన తదుపరి దర్యాప్తు జరుగుచున్నది.ఈ సైబర్ నేరస్తులను పట్టుకోవడంలో కృషిచేసిన కాగజ్నగర్ టౌన్ సీఐ ప్రేమ్ కుమార్, ఎస్ఐ ప్రశాంత్, డి4సి (డిస్టిక్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్) ఇన్స్పెక్టర్ రవీందర్, ఎస్సై తేజస్విని మరియు డి ఫోర్ సి టీమ్ ను ఎస్పీ . ప్రత్యేకంగా అభినందించారు.ఆన్లైన్, సైబర్ క్రైమ్ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని, ఎవరైనా సైబర్ క్రైమ్ కి గురి అయ్యినట్లాతే 1930 కి సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాగజ్నగర్ డిఎస్పి వాహిదుద్దీన్, కాగజ్నగర్ టౌన్ సిఐ ప్రేమ్ కుమార్, డి ఫోర్ సి ఇన్స్పెక్టర్ రవీందర్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్, డి.ఫోర్.సి ఎస్.ఐ తేజస్విని పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News