Wednesday, March 18, 2026

చదువుల్లో 100% ఉత్తీర్ణత సాధించాలి పేట జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ గోవింద్ రాజ్…..

నేటి సాక్షి, నారాయణపేట, నవంబర్ 15, నారాయణపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాజాపూర్ జిల్లా విద్యాశాఖ అధికారి గోవింద్ రాజ్ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. విద్యార్థుల హాజరు శాతము ఎఫ్ ఆర్ ఎస్ గురించి పదో తరగతి విద్యార్థులకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి సిలబస్ ని అడిగి తెలుసుకోవడం జరిగింది. పాఠశాల మధ్యాహ్న భోజనము పరిశీలించడం జరిగింది పదో తరగతి సమ్మేటివ్ అసెస్మెంట్ జాబ్ పత్రాలను పరిశీలించి పలు సూచనలను తెలియజేశారు పదో తరగతిలో ప్రతి విద్యార్థి స్లిప్ టెస్ట్ రాయవలెను స్పెషల్ క్లాసులు అన్ని పాఠశాలల్లో ఉదయము ఎనిమిది గంటలకు ప్రత్యేక తరగతుల నిర్వహణ మరియు సాయంత్రము స్పెషల్ టేస్ట్ నిర్వహించాలి ఉపాధ్యాయులు వెంటనే స్పెషల్ టెస్టును మూల్యాంకనం చేసి విద్యార్థులకు వాటిలోని తప్పులను తెలియచేయాలి అని తెలియజేశారు మరియు ప్రాథమిక పాఠశాల జాజాపూర్ గ్రంథాలయమును పరిశీలించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డిసిఇబి సెక్రెటరీ శ్రీ రాజేంద్రకుమార్ మధ్యాహ్న భోజన పథకం ఇంచార్జ్ అధికారి యాదవ్ శెట్టి మరియు మధుసూదన్ రావు హెచ్ భాను ప్రకాష్ నిర్మల లక్ష్మణ్ శిరీష ప్రతాప్ మంగళ రఘురాం రెడ్డి పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News