Wednesday, March 18, 2026

గుర్తుతెలియని మృతదేహం…..

నేటి సాక్షి,నారాయణపేట, నవంబర్ 15,నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అప్పక్ పల్లి గ్రామ శివారులో శనివారం ఉదయం 8:30 గంటల సమయంలో ఒక గుర్తు తెలియని శవం గుర్తించడం జరిగింది. ప్రాథమిక పరిశీలనలో, మృతుని వయస్సు 30 నుండి 40 సంవత్సరాల మధ్యలో ఉండవచ్చని, మరణించి సుమారు 10 నుండి 15 రోజులు అయి ఉండవచ్చని అంచనా.మృతుని శరీరంపై ఎటువంటి గుర్తింపు వస్తువులు లేదా ఆధారాలు లభించకపోవడంతో, మృతుని వివరాలు తెలియరాలేదు. దీనికి సంబంధించి సమాచారం తెలిసిన వారు వెంటనే పోలీసులను సంప్రదించాలని పేట రూరల్ ఎస్సై రాముడు తెలిపారు.శవం గుర్తింపు, మరణానికి గల కారణాలపై విచారణ నారాయణపేట రూరల్ పోలీసులు కొనసాగిస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News