నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)చిత్తూరు, నవంబర్ 15: అపోలో యూనివర్సిటీలోని క్విజ్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం జాతీయ విద్యా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని కార్యక్రమం ఏర్పాటు చేశారు.ముఖ్య అతిథిగా హాజరైన వైస్ ఛాన్సలర్ డాక్టర్ హెచ్. వినోద్ భట్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ప్రసంగిస్తూ— “విద్యతోనే సంపద సాధ్యం. నాణ్యమైన విద్య దేశ అభివృద్ధికి పునాది. మౌలానా ఆజాద్ దూరదృష్టి భారత విద్యా వ్యవస్థకు దిశానిర్దేశం చేసింది. ఆయన విద్యాశాఖ మంత్రి అయినప్పుడు దేశంలో కేవలం 20 యూనివర్సిటీలు మాత్రమే ఉండగా, నేడు ఆ సంఖ్య 1500 దాటింది. అమెరికాలో 80శాతం మంది విద్యార్థులు యూనివర్సిటీలకు చేరుతుండగా, మన దేశంలో ఇది ఇంకా 30శాతమే. అందరికీ ఉన్నత విద్య అందుబాటులోకి రావడానికి అవకాశాలు మరింత విస్తరించాలి” అని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో జాతీయ విద్యా దినోత్సవ క్విజ్ పోటీ నిర్వహించారు.ఘనంగా జనజాతియా గౌరవ దివస్ వేడుకఅపోలో యూనివర్సిటీలోని ఈవెంట్ మేనేజ్‌మెంట్ క్లబ్ ఆధ్వర్యంలో జనజాతియా గౌరవ దివస్‌ను శనివారం ఘనంగా నిర్వహించారు. ఖాన్ద్ ఉద్యమ నాయకుడు, ప్రముఖ గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బీర్‌సా ముండా జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉపకులపతి డాక్టర్ హెచ్. వినోద్ భట్ బీర్‌సా ముండా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, గిరిజనుల హక్కులు, వీరత్వం, దేశభక్తిని గుర్తుచేశారు. “ఎన్‌ఎంబిసి సహకారంతో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 90 మంది గిరిజన విద్యార్థులు అపోలో యూనివర్సిటీలో చదువుతున్నారు. వారికి గౌరవప్రదమైన వసతి, ఉత్తమ విద్యా వాతావరణం అందిస్తున్నాం” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సేతురామ సుబ్బయ్య, డీన్ డా. రామయ్య ఇటుమల్ల, స్టూడెంట్స్ ఎఫైర్స్ కోఆర్డినేటర్ డా. షానీ, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు ఆన్‌వేష పాల్, రాకేష్ కుమార్ యాదవ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.





