Wednesday, March 18, 2026

⭐ మహబూబాబాద్ జిల్లా కేజీకేస్ ఉపాధ్యక్షులుగాడొనికెన రామన్న ఏకగ్రీవ ఎన్నిక ⭐

నేటి సాక్షి మహబూబాబా ద్ (భూక్యా రవి నాయక్) నవంబర్ 15మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కిరాణా వర్తక ఫంక్షన్ హాల్‌లో జరిగిన కల్లుగీత కార్మిక సంఘం మూడవ జిల్లా మహాసభలో, రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షుడు ఎం.వి. రమణ, కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నూతన జిల్లాకమిటీని ఘనంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.✔ అధ్యక్షుడు : యమగాని వెంకన్న✔ ప్రధాన కార్యదర్శి : గౌని వెంకన్న✔ ఉపాధ్యక్షుడు : డొనికెన రామన్న (ఏకగ్రీవ ఎన్నిక)రాష్ట్ర అధ్యక్షులు ఎం.వి. రమణ మాట్లాడుతూ—కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ప్రతి సొసైటీకి భూసంపత్తి కేటాయింపు, పెండింగ్ ఎక్ర్స్గేషియ విడుదల, 500 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు, మోటార్ బైక్స్, 50 ఏళ్లు నిండిన కార్మికులకు పెన్షన్, సబ్సిడీ రుణాలు వంటి హక్కులను సాధించేందుకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కొత్త ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన డొనికెన రామన్న గారు మాట్లాడుతూ—తనపై ఉంచిన విశ్వాసానికి ప్రతి సభ్యుడికి కృతజ్ఞతలు తెలుపుతూ, కల్లుగీత కార్మికుల హక్కుల సాధన కోసం అహర్నిశలు కష్టపడతానని, ఐక్యతే శక్తి అనే నమ్మకంతో సంఘ బలోపేతానికి కట్టుబడి ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో గునిగంటి మోహన్, చిర్ర సతీష్ గౌడ్, డొనికెన జంపన్న, దయాకర్, సీతారాములు, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News