Wednesday, March 18, 2026

మహబూబాబాద్ — వైద్యం వికటించి కాడెద్దు మృతి! అధికారుల దృష్టికి

నేటి సాక్షి మహబూబాబా ద్(భూక్యా రవి నాయక్) నవంబర్ 15నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లి రూప్లతండాకు చెందిన రైతు బానోత్ శ్రీను తెలిపిన వివరాల ప్రకారం—అనారోగ్యంతో ఉన్న తన కాడెద్దుకు గ్రామీణ సంచార పశువైద్యశాలకు (1962) సమాచారం ఇవ్వగా, వచ్చిన వైద్య సిబ్బంది ఇంజక్షన్ ఇవ్వగానే కొద్ది సేపటికే ఎద్దు మృతిచెందింది.వైద్యచర్యలో నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రైతు నష్టాన్ని పరిగణలోకి తీసుకుని, విషయం పై సంబంధిత పశువైద్యశాఖ అధికారులు తక్షణ విచారణ చేసి బాధ్యత వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని, రైతుకు నష్టపరిహారం కల్పించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News