నేటి సాక్షి జిన్నారం: (బొల్లారం మున్సిపాలిటీ)బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ (జనతాదళ్ (యూనైటెడ్) – బీజేపీ కూటమి) ఘన విజయం సాధించిన సందర్భంగా…బొల్లారంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కే జె ఆర్. ఆనంద్ కృష్ణారెడ్డి, ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు అంబరాన్ని తాకాయి!బీజేపీ కార్యకర్తలు నాయకులు స్వీట్లు పంచుకుంటూ,పండ్లను పంపిణీ చేస్తూ తమ సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఘనంగా చాటుకున్నారు.కే జె ఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి, స్వయంగా కార్యకర్తలకు, ప్రజలకు పండ్లు పంచుతూ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.





