నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)చంద్రగిరి మండల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మోహన్ నాయుడును రాష్ట్ర వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేసుకుని వచ్చిన ఆయనను కల్‌రోడ్డుపల్లిలోని ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం వైఎస్‌ఆర్‌సీపీ చంద్రగిరి నియోజక వర్గ ఇన్‌చార్జి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డితో మోహన్ నాయుడును హర్షిత్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడించగా మోహిత్‌రెడ్డి కూడా ఆరోగ్యం కుదుట పడేంత వరకు విశ్రాంతి తీసుకోవాలని, అత్యవసరంగా ఏ అవసరం వచ్చినా తమకు సమాచారం అందించాలన్నారు. మోహన్ నాయుడును పరామర్శించిన వారిలో ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కొటాల చంద్రశేఖర్ రెడ్డి, దేవారెడ్డి, కోటి రెడ్డి, చెంగల్రాయులు, వెంకటరత్నం, నాగరాజు, రమేష్ లు వున్నారు.





