నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)చంద్రగిరి నవంబర్ 15 : కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణకు గ్రామాల్లో భారీ స్పందన లభిస్తోంది. అందులో భాగంగానే చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీలో చేపట్టిన సంతకాల సేకరణకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేశారు. ప్రతి గ్రామంలో మహిళలు, యువత ముందుకు వచ్చి ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేఖంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇచ్చారు. పనపాకంలో చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమంకు భారీ స్పందన రావడంతో పక్క గ్రామాల ప్రజలు కూడా తమ వ్యతిరేకతను తెలియపరచడానికి ముందుకు వస్తున్నారు. ప్రజా ఉద్యమంలో సంతకాలు పూర్తి చేసిన ప్రతులను రాష్ట్ర వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డికి అందజేశారు. పనపాకం లో కోటిసంతకాలు ఉధ్యమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన వారిలో కసా గోపాల్,అమాస నాగేశ్వరరావు, చెంగల్ పండు ,శేషాద్రి, సుదర్శన్, శివనాధం, సురేష్,హిమగిరి, రాము, సుబ్రమణ్యం,లు ఉన్నారు.వీరందరినీ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి అభినందించారు. మండల పార్టీ అధ్యక్షులు కొటాల చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీపీ హేమేంద్రకుమార్ రెడ్డి చేతులు మీదుగా హర్షిత్‌రెడ్డికి స్థానిక నేతలు అందించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ బొజ్జా వెంకటరత్నం,పార్టీ నేతలు అగరాల దేవారెడ్డి, చెంగల్రాయులు, కోటీశ్వర్ రెడ్డి,బొజ్జా ఆనంద, అమాస పవన్, భరత్, తదితరులు పాల్గొన్నారు.





