Wednesday, March 18, 2026

*దేశంలో తీవ్రవాదం కొత్తదారుల్లో ప్రారంభం కావడం దురదృష్టకరం – శ్రీరాములు అందెల**సామాజిక భద్రత మనందరి ప్రధమ కర్తవ్యం – శ్రీరాములు అందెల* *

(నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం నవంబర్ 15:)*ఢిల్లీ మరియు శ్రీనగర్‌లో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో, *రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్, మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ అందెల శ్రీరాములు* స్పందించారు. ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గ బిజెపి కార్యాలయంలో శ్రీరాములు మాట్లాడుతూ దేశ భద్రత మన అందరి సామాజిక బాధ్యత అని…. దేశంలో తీవ్రవాదం కొత్త దారుల్లో ఆరంభం కావడం దురదృష్టకరమని, ఉన్నతమైన వృత్తిలో ఉన్నవారు కూడా ప్రజల ప్రాణాలను హరించడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ తగు ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతూ మన పరిసరాల్లో, కాలనీలలో, గ్రామాల్లో అపరిచిత వస్తువులు, అనుమానాస్పద వ్యక్తులపై అప్రమత్తంగా ఉండటం ప్రతి పౌరుడి కర్తవ్యం అన్నారు. మన మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో అనాధికారికంగా విదేశీ వలసదారులు అక్రమంగా నివసిస్తున్నారు అనే అనుమానాలు ఉన్నాయని….ఈ నేపథ్యంలో, మహేశ్వరం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని కాలనీ అధ్యక్షులు, సంఘ ప్రతినిధులు, మరియు ప్రజలంతా కలిసి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ఈ సదస్సుల్లో—భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడం అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలిఅనుమానాస్పద విషయాలను సంబంధిత అధికారులకు ఎలా తెలియజేయాలి కాలనీలు, పంచాయతీలు స్థాయిలో విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేయడంవంటి అంశాలపై చర్చించి, సమిష్టిగా చర్యలు తీసుకుంటే మన సమాజం మరింత సురక్షితంగా ఉంటుందన్నారు.మన దేశ భద్రత – మన బాధ్యత.మన మహేశ్వరం నియోజకవర్గాన్ని – మన చేతులలో భద్రంగా ఉంచుకుందాం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News