నేటి సాక్షి నల్లబెల్లి ప్రతినిధి నవంబర్ 15 : ఐకెపి కేంద్రాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య శారద. శనివారం నల్లబెల్లి మండలం గోవిందపూర్ గ్రామంలోని ఐకెపి కేంద్రాలను కలెక్టర్ సత్య శారద, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి పరిశీలించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించాలని కోరారు. ప్రైవేట్ దళారులకు అమ్మి రైతులు మోసపోకుండాదాని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలవకుండా దాన్యం తడవకుండా పట్టాల సిద్ధంగా ఉంచాలని కాటా వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డిఎం సంధ్యా, ఎమ్మార్వో ముప్పు కృష్ణ,ఎంపీడీవో శుభనివాస్, ఏవో బన్న రజిత, డిపిఎం దాస్, ఏపీఎం సుధాకర్, మండలాధికారులు సీసీలు, రైతులు పాల్గొన్నారు.





