ణీ నేటి సాక్షి నారాయణపేట నవంబర్ 16,శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ – ఉమ్మడి పాలమూర్ జిల్లా ఆధ్వర్యంలో గీతా జయంతి ఉత్సవాల సందర్బంగా భగవత్ గీతా కంఠస్త పోటీలు నర్వ లొ నిర్వహించడం జరిగింది. ఇట్టి పోటిల్లో మరికల్ మండల కేంద్రానికి చెందిన శ్రీవాణి హై స్కూల్ విద్యార్థిని బి. మౌనిక 7 వ తరగతి అమ్మాయి కి ఉమ్మడి జిల్లా స్థాయిలో మొదటి బహుమతి గెలుపొందడం జరిగింది. ఈ సందర్బంగా పాఠశాల ప్రిన్సిపాల్ వినీతమ్మ , కరెస్పాండంట్ పూర్ణిమ వెంకటేశ్వర్లు గారు మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థిని అభినందించడం జరిగింది.




