Wednesday, March 18, 2026

ఊరంతా వర్షపు నీరు నిలువ ఉండి మురుగునీరు గ్రామంలో

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి నవంబర్ 16 అంటువ్యాధులకు కారణమవుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు మండలంలోని పంచాయతీ కేంద్రం కాటి పేరులో వర్షపు నీరు ఎక్కడపడితే అక్కడ నిలువ ఉండి అంటువ్యాధుల కారకాలుగా మారుతున్నాయని ప్రజలు వాపోతున్నారు ఇటీవల కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలైన పలు ప్రాంతాలలో మురుగునీరు నిల్వ ఉన్నాయి దీంతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయని వాపోతున్నారు వీధుల్లో వ్యర్థపు నీరు మురుగునీరు నిల్వ ఉండి దోమలు అధికంగా ఉన్నాయని పలుమార్లు అధికారులకు పాలకులకు తెలిపిన ఫలితం లేకుండా పోయిందని వారు వాపోతున్నారు ఇకనైనా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకుని మురుగునీరుని తొలగించి అంటూ వ్యాధుల బారిన పడకుండా రక్షించాలని వారు కోరుతున్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News