*( నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం నవంబర్ 16:)*రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ సిపిఐ కార్యాలయంలో,మహేశ్వరం–కందుకూరు మండలాల కౌన్సిల్ సభ్యుల సమావేశం నియోజకవర్గ కార్యదర్శి బి.దత్తు నాయక్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పానుగంటి పర్వతాలు మాట్లాడుతూ:1925 డిసెంబరు 26న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించబడిందని, పేదల కోసం,బడుగు–బలహీన వర్గాల కోసం,కార్మిక–కర్షకుల శ్రేయస్సు కోసం, సమసమాజ స్థాపన కోసం ఏర్పాటు చేసిన పార్టీ సిపిఐ అని గుర్తుచేశారు.అనేక త్యాగాలు,పోరాటాలు,భూ సంగ్రామాలతో నిండిన ఘన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకే చెందిందని పేర్కొన్నారు.ఆ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 26వ తేదీన ఖమ్మం పట్టణంలో లక్షలాదిమంది పాల్గొనే భారీ బహిరంగ సభ జరుగనుందని, కార్మికులు,కర్షకులు,రైతులు,పార్టీ శ్రేయోభిలాషులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి. దత్తు నాయక్ మాట్లాడుతూ, భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ముగింపు సభకు పురస్కరించుకొని మహేశ్వరం నియోజకవర్గంలోని సరూర్నగర్, బాలాపూర్, కందుకూరు, మహేశ్వరం మండలాల్లో జీపు జాతాలు నిర్వహించి పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు నడుం బిగించాలన్నారు. గడపగడపకు ప్రచారం ద్వారా పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పల్నాటి యాదయ్య,మహేశ్వరం మండల కార్యదర్శి పి.దేవేందర్ గౌడ్,కందుకూరు మండల కార్యదర్శి కొమ్మగళ్ల రాజు,వైట్ క్లిప్ జనరల్ సెక్రెటరీ ఎన్. యాదగిరి,సాయి,రామచంద్రయ్య,రాములు, రమేష్,జోసెఫ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.బి. దత్తు నాయక్ సిపిఐ మహేశ్వరం నియోజకవర్గ కన్వీనర్





