నెటి సాక్షి, బెజ్జంకి:బెజ్జంకి మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మండల అధ్యక్షులు కొలిపాక రాజు ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిని మల్లేశం ప్రధాన అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఈ నెల 19వ తేదీన హుజురాబాద్ పట్టణంలో జరగనున్న బూత్ స్థాయి బీజేపీ సమ్మేళనానికి మండలంలోని ప్రతి కార్యకర్త తప్పనిసరిగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మేళనానికి కేంద్ర హోం సహాయక మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ హాజరు కానున్నారని తెలిపారు.ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని మండల నాయకులకు సూచిస్తూ, బీహార్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టినట్టే, త్వరలో జరగబోయే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇలాగే ప్రజలు ఆశీర్వదిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.అకాల వర్షాలతో రైతులకు నష్టం స్పందించని ప్రభుత్వం పై విమర్శలుసమావేశంలో పాల్గొన్న బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ,బెజ్జంకి మండలంలో ఇటీవల అకాల వర్షాల కారణంగా వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలు తీవ్రంగా నష్టపోయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునే చర్యలు తీసుకోలేదని తీవ్ర విమర్శలు చేశారు.నష్టపోయిన రైతులకు తక్షణమే ఆర్థిక సాయం ప్రకటించాలని ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ బుర్ర మల్లేశం గౌడ్,మండల నాయకులు కొత్తపేట రామచంద్రం, సంఘ రవి, తూముల రమేష్,తోపాటు ఇతర బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.





