Wednesday, March 18, 2026

*పొగమంచు దృష్ట్యా వాహనాలను జాగ్రత్తగా డ్రైవ్ చేయండి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్* —————————————–జగిత్యాల టౌన్

నేటి సాక్షి(పూరెళ్ల బాపు)…………………………………శీతాకాలం దృష్ట్యా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండటంతో ఉదయం మరియు రాత్రి వేళల్లో రహదారులపై పొగమంచు అధికంగా ఏర్పడుతోంది. దీనివల్ల ముందున్న వాహనాలు స్పష్టంగా కనపడక ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ నేపథ్యంలో అన్ని వాహనదారులు తప్పనిసరిగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ సూచించారు.*వాహనదారులకు, ప్రజలకు పోలీసుల సూచనలు*1. పొగమంచు ఎక్కువగా ఉన్నప్పుడు వాహన వేగం తగ్గించుకోవాలి, ఆవశ్యకమైతే రోడ్డు పక్కకు ఆపి పరిస్థితి మెరుగుపడిన తర్వాతే ప్రయాణం కొనసాగించాలి.2. హెడ్‌లైట్లు, ఫాగ్‌లైట్లు ఆన్ చేసి ప్రయాణించాలి. హెడ్‌లైట్లు హై-బీమ్‌లో పెట్టకుండా లో-బీమ్‌లో ఉపయోగించాలి.3. ముందున్న వాహనానికి సురక్షిత దూరం పాటించాలి. ఆకస్మికంగా బ్రేక్ వేయడం ప్రమాదాలకు దారితీస్తుంది.4. పొగమంచు ఉన్నప్పుడు ఓవర్‌టేక్ (Over take) చేయడం అత్యంత ప్రమాదకరం. ఎదురుగా లేదా పక్కన ఉన్న వాహనాలు స్పష్టంగా కనిపించనందున, ఓవర్‌టేక్ ప్రయత్నాలు తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు.5. పొగమంచు అధికంగా ఉన్న సమయంలో మీ వాహనాలను రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ పార్క్ చేయకండి. ఒకవేళ రోడ్డు పక్కన పార్క్ చేయాల్సి వస్తే ఇండికేటర్లను ఆన్ చేయాలి. రోడ్ బే, పెట్రోల్ బంక్ వంటి సురక్షిత ప్రదేశాల్లో ఆగడం మంచిది.6. రోడ్డుపై జీబ్రా లైన్లు, సైన్‌బోర్డులు కనిపించకపోవచ్చని గుర్తుంచుకొని అత్యంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి.7. బైక్ రైడర్లు తప్పనిసరిగా హెల్మెట్, కార్ డ్రైవర్లు సీట్‌బెల్ట్ ధరించాలి.8. పాదచారులు కూడా రోడ్డు దాటేటప్పుడు రెండు వైపులా చూసి, అవసరమైతే వాహనాలు పూర్తిగా ఆగేవరకు వేచి ఉండాలి.9. హైవేలపై ప్రయాణించే వారు ముందుగానే వాతావరణ పరిస్థితులు తెలుసుకుని బయలుదేరాలి.10. బస్సులు, లారీలు, ఆటోలు వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు నడిపే డ్రైవర్లు మరింత జాగ్రత్తలు పాటించాలి.“శీతాకాల రాత్రుల్లో పొగమంచు వల్ల దృష్టి తగ్గడం సహజం కానీ ప్రమాదాలు మాత్రం మన జాగ్రత్తలతో తప్పించుకోవచ్చు అని ప్రతి డ్రైవర్‌ ఓర్పు, అప్రమత్తత, నిబంధనలు పాటించడం ద్వారా అనేక ప్రాణాలు కాపాడవచ్చు అని పై సూచనలు తప్పకుండా పాటించాలని ఎస్పి సూచించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News