నేటి సాక్షి, నారాయణపేట,నవంబర్ 17, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలోమంగళవారం నాడు బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం నాడు ప్రార్ధన సమయంలో విద్యార్థులు జగదీష్ మనోజ్ నాయక్ లను ఉపాధ్యాయులు సన్మానించి అభినందించారు… జగదీష్ క్రికెట్ లో సత్తా చాటి అండర్ 14 విభాగంలో ఉమ్మడి జిల్లా కు ఎంపికైయ్యాడు.. మనోజ్ నాయక్ భగవద్గీత శ్లోకాల పోటీలో పాల్గొని ద్వితీయ స్థానంలో నిలిచాడు…ఇలాంటి విద్యార్థులను ఆదర్శంగా తీసుకుని మిగిలిన విద్యార్థులు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రధానోపాధ్యాయులు నాగరత్నమ్మ మార్గదర్శనం చేశారు.. ప్రతి ఒక్కరు జీవితంలో క్రమశిక్షణ పట్టుదల నైతిక వులువలు ఉండాలని …మున్ముందు మరింత గా మరికల్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థుల అన్ని రంగాల్లో రాణించాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.





