Wednesday, March 18, 2026

మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహలపై అవగాహన కార్యక్రమం*————————————-జగిత్యాల టౌన్ –

*నేటి సాక్షి(పూరెళ్ల బాపు)………………………………ఈరోజు జగిత్యాల అర్బన్ పీఎంశ్రీ దరూర్ క్యాంప్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జగిత్యాల జిల్లా బాలల పరి రక్షణ విభాగన్ నుండి చైల్డ్ లైన్ 1098 అధికారి కేసు వర్కర్ రజిత స్కూల్ లోని పిల్లలకు బాల్య వివాహంపై అవగాహన కల్పించడం జరిగింది. స్కూల్లో పిల్లలకి బాల్య వివాహ చట్టం- 2006, పోక్సో చట్టం -2012,మత్తు పదార్థాలు మాదకద్రవ్యాలు పై అవగాహన కల్పించడం జరిగింది.బాల్య వివాహాల నిరోధక చట్టం- 2006 ప్రకారం 18 సంవత్సరాల లోపు అమ్మాయికి 21 సంవత్సరంలోపు అబ్బాయికి వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని అందుకు రెండు సంవత్సరాల జైలు శిక్ష మరియు లక్ష రూపాయల వరకు జరిమానా విధించబడునని,అదేవిధంగా బాల్యవివాహాల వల్ల పిల్లలకు భవిష్యత్తులో మానసిక శారీరక ఎదుగుదల ఆగిపోతుందని,అలాగే ప్రభుత్వం నుంచి ఇచ్చే ప్రోత్సాహాలు కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ వంటి పథకాలు వర్తించవని,గ్రామపంచాయతీ పరిధిలో బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసి పిల్లల సమస్యలను గురించి చర్చించి పిల్లలకు సమస్య ఉంటే ఈ కమిటీ దృష్టికి తీసుకురావాలని కోరారు. మరియు బాలబాలికలు మత్తు కి బానిస అవ్వడం మరియు మొబైల్ ఫోన్స్ కి దూరంగా ఉండాలని అలాగే 18 సంవత్సరాల లోపు బాలబాలికలకి రక్షణ మరియు సంరక్షణ అవసరమైన పిల్లల కొరకు 24 గంటలు పనిచేసే ఉచిత అత్యవసర ఫోన్ సేవా సౌకర్యం *చైల్డ్ హెల్ప్ లైన్1098* పోలీస్ 100, సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బాల్య వివాహాలు లేని భారతదేశ కోసం ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పీఎంశ్రీ జిల్లా పరిషత్ దరూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమర్ నాథ్ రెడ్డి, ఐసీడీస్ సూపర్వైజర్ స్వరూప రాణి, సహాయ NGO నుండి లహరి, అంగన్వాడి టీచర్ శ్యామల, ఆశా వర్కర్ అంజలి, పాఠశాల ఉపాధ్యాయులు శ్రీదేవి, శ్రీలత, గంగయ్య, పవన్, షకీల్, ప్రభాకర్, కిరణ్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News