Wednesday, March 18, 2026

*ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కార మార్గం చూపాలి**వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్**ప్రజావాణి ఫిర్యాదుల సంఖ్య : 24*——————————————–జగిత్యాల టౌన్ –

నేటి సాక్షి(పూరెళ్ల బాపు)…………………………………….. ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అదేశించారు.సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్ లు మరియు ఆర్డీఓల తో కలిసి స్వీకరించారు. *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ* పలు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలనుండి ప్రజలు సమస్యలు విన్నవించుకోడానికి ప్రజావాణికి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పై సమగ్ర విచారణ చేపట్టి త్వరగా పరిష్కారానికి చొరవ చూపాలని అన్నారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా ఈరోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 24 ఫిర్యాదులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.ఎస్ లత, బి.రాజగౌడ్, జగిత్యాల, మెట్ పల్లి, కోరుట్ల ఆర్డీఓలు మధు సూధన్, శ్రీనివాస్, జీవాకర్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News