Wednesday, March 18, 2026

పరిమితికి మించి కూలీలను తరలిస్తున్న వాహనాలపై కేసులు నమోదు పేట టౌన్ ఎస్సై వెంకటేశ్వర్లు…..జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు

నేటి సాక్షి నారాయణపేట,నవంబర్ 17, నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నారాయణపేట పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించగా దామరగిద్ద మండలం కాన్కుర్తి నుండి నారాయణపేట మీదుగా ఉట్కూరులో పత్తి తీయడానికి వెళ్తున్న కూలీలు పరిమితికి మించి ప్రమాదకరంగా, పెద్ద సంఖ్యలో ఒక్కొక వాహనంలో 40 నుండి 50 మంది వరకు ప్రయాణిస్తున్న మూడు వాహనాలను పట్టుకుని కూలీలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ… ఇలా గూడ్స్ వాహనాలలో పరిమితికి మించి ప్రయాణించడం చట్టరీత్యా నేరమని, అనుకోకుండా వాహనాలు ప్రమాదానికి గురైతే పోయేది మీ ప్రాణాలేనని ఇది మీ ప్రాణాలకు పొంచి ఉన్న ప్రమాదమని ప్రతి ఒక్కరు గ్రహించాలని అన్నారు. అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే ఎవ్వరూ బాధ్యులని ముఖ్యంగా పెద్దలు మీ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకొని వాహనాలలో తగిన పరిమితిలో ప్రయాణించాలని, అధిక మొత్తంలో కూలీలు ప్రయాణించడం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు.డ్రైవర్లకు కఠినమైన హెచ్చరికలు జారీ చేసి, రూల్స్‌ను పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడేలా వారి ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదని మళ్లీ ఇలాంటి కేసులు పునరావృత్తం అయితే వాహనాలను సీజ్ చేసి ఆర్టిఓ కు రాయడం జరుగుతుందని హెచ్చరించారు. పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్తున్నా మూడు వాహణాలపై 03 కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. ప్రజలు, డ్రైవర్లు ప్రయాణ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిచారు.ఈ కార్యక్రమంలో ఎస్సై _2 గాయత్రి, నారాయణపేట టౌన్ పోలీసులు అంజిలయ్య, పిసి లు సంతోష్, నరసింహ కూలీలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News