నేటి సాక్షి, బెజ్జంకి:కళ్యాణ లక్ష్మి చెక్కు విషయంలో తీవ్రమైన నిర్లక్ష్యం, గోల్‌మాల్ జరిగినట్టు ఆరోపిస్తూ బెజ్జంకి మండలంలోని చీలాపూర్ గ్రామానికి చెందిన ధామెర స్వరూప భర్త గౌరయ్య సిద్దిపేట జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం తమ కూతురు ధామెర కళ్యాణి వివాహం అనంతరం కళ్యాణలక్ష్మీ పథకానికి దామెర స్వరూప దరఖాస్తు చేసుకోగా చెక్ రావడం జరిగినది.జూన్ 16 వ తేదీన ఎల్ఎండి క్యాంప్ కార్యాలయంలో మానకొండూర్ ఎమ్మెల్యే డా కవ్వంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మీ చెక్ పంపిణీ చేశారు.తేదీ 17-జూన్-2024 రోజున బక్రీద్ సంధర్బంగా బ్యాంక్ లకు సెలవు ఉన్నందున తేదీ 18 న యూనియన్ బ్యాంక్ అకౌంటు నెంబర్ : 073510100004535, బెజ్జంకి లో చెక్ నెంబర్ “266515” జమ చేశారు.తేదీ 26-జూన్-2024 న అకౌంటు లో జమ అయినట్టు సెల్ ఫోన్ కు మెసేజ్ రావడంతో బ్యాంక్ కు వెళ్ళగా బ్యాంక్ లో క్రెడిట్ కాలేదు.బ్యాంక్ మేనేజర్ ను అడుగగా చెక్ డేట్ అయిపోయింది అని బ్యాంక్ మేనేజర్ చెక్ రిటర్న్ మరియు బ్యాంక్ రశీదు ఇచ్చారు.తిరిగి అట్టి చెక్ ను 25-జూన్-2024 న అప్పటి తహసిల్దార్ అయిన శ్రీనివాసరెడ్డి కి ఇచ్చారు.మళ్ళీ నెల తరువాత అడిగితే ఆర్డీఓ ఆఫీసు కి పంపడం జరిగిందని తహసిల్దార్ చెప్పగా, ఆర్డీఓ హుస్నాబాద్ వద్దకు వెళ్ళగా, చెక్ మా వద్దకు రాలేదని రికార్డు లో కూడా లేదని తెలిపారు.గత 17 నెలల నుంచి తహసిల్దార్ మరియు ఆర్డీఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని సోమవారం ప్రజావాణి లో సిద్దిపేట కలెక్టర్ కు పిర్యాదు చేశారు.అధికారుల చుట్టూ కళ్యాణ లక్ష్మీ చెక్ కోసం తిరగగా మాకు తెలవది అని అధికారులు మమ్మల్ని పట్టించుకుంటలేరు చెక్ గురించి అడుగుతే ఏమో తెలీదు అంటూ దాటవేస్తున్నారని ,మాకు కళ్యాణ లక్ష్మీ చెక్ ఇప్పించగలరని బాధితురాలు దామెర స్వరూప కోరుతున్నారు.





